Begin typing your search above and press return to search.
ఏడుగురు కేంద్రమంత్రులు పదవులు ఊడిపోయాయి
By: Tupaki Desk | 1 Sep 2017 4:59 AM GMTమరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. విస్తరణకు వీలుగా పలువురు కేంద్రమంత్రులు గురువారం రాత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు రాజీనామాకు సిద్ధపడ్డారు. విస్తరణలో కొందరు మంత్రుల శాఖలు మారే అవకాశముంది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరుపతి పర్యటన నుంచి దేశరాజధానికి తిరిగి వచ్చిన తర్వాత శనివారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తప్పుకొంటున్నవారిలో ఉమాభారతి - కల్ రాజ్ మిశ్రా - రాజీవ్ ప్రతాప్ రూడీ - మహేంద్రనాథ్ పాండే - గిరిరాజ్ సింగ్ - సంజీవ్ బలియాన్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాజీనామా చేస్తారని తెలిసింది. ఉమాభారతి - కల్ రాజ్ మిశ్రా క్యాబినెట్ మంత్రులు కాగా మిగిలినవారు సహాయమంత్రులు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంత్రులను విడివిడిగా కలుసుకుని రాజీనామాలకు ఒప్పించినట్టు తెలుస్తున్నది. ప్రధాని పక్కన పెట్టే ముందు మీరే రాజీనామా చేయాలని వారికి ఆయన సూచించారు. ఆయన సూచన మేరకు వీరంతా పార్టీ సంస్థాగత కార్యదర్శి రాంలాల్ కు రాజీనామా లేఖలను అందజేశారు. రకరకాల కారణాల వల్ల మంత్రివర్గం నుంచి వీరి తొలిగింపు దాదాపుగా ఖాయమని పార్టీ వర్గాలు మీడియాకు సూచనలు వెలువరించిన కొన్నిగంటల్లోనే రాజీనామాల పరంపర మొదలైంది. రూడీ - గిరిరాజ్ సింగ్ - బలియాన్ లు ఎన్డీయే చేపట్టిన కార్యక్రమాల అమలులో వెనుకబడిపోయారని వారి పనితీరు అంచనాల్లో తేలినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నిర్మలా సీతారామన్ ను పార్టీ పని నిమిత్తం తప్పించనున్నట్టు చెప్పుకుంటున్నారు. దక్షిణాదిలో పార్టీ కోసం ఆమె సేవలను వినియోగించుకోవాలని అమిత్ షా భావిస్తున్నారు.
కల్ రాజ్ మిశ్రా కేంద్రమంత్రులకు అనధికారికంగా విధించిన వయోపరిమితి 75వ సంవత్సరాలు దాటిపోయారు. ఆయనను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతారనేది దాదాపుగా ఖాయమైంది. మహేంద్రనాథ్ పాండే యూపీ బీజేపీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఉమాభారతి ప్రధాని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో వారణాసి ప్రజలకు గంగా శుద్ధిపై ఇచ్చిన హామీని పూర్తి చేయలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె ఆరోగ్య కారణాలపై రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. వరుస రైలు ప్రమాదాలపై కలత చెందిన రైల్వేమంత్రి సురేశ్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డ సంగతి తెలిసిందే. ప్రధాని ఆయన శాఖను మారుస్తారని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే చిట్టచివరి మంత్రివర్గ విస్తరణ అవుతుందని భావిస్తున్నారు. ప్రధాని మోడీ 3-5 తేదీల్లో చైనాలో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత 6-19 తేదీల్లో పితృపక్షం ఉంటుంది కనుక మంత్రివర్గ విస్తరణ వంటి ముఖ్యమైన పనులు చేపట్టరు. కనుక శనివారమే (2వ తేదీ) విస్తరణ పూర్తి చేస్తారని సమాచారం.