Begin typing your search above and press return to search.

జగన్ ప్రకటనపై స్పందించిన మంత్రులు

By:  Tupaki Desk   |   22 Nov 2021 1:30 PM GMT
జగన్ ప్రకటనపై స్పందించిన మంత్రులు
X
ఏపీకి మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ మంత్రులు కౌంటర్ అటాక్స్ చేశారు. మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ ఎదురుదాడి చేశారు. 'వెనక్కి తలొగ్గడానికి ఇది మోడీ ప్రభుత్వం కాదని.. జగన్ ప్రభుత్వం' అని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నామో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే మరోసారి సమగ్ర బిల్లును తీసుకొస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. తమ ప్రాంతాలకు కావాల్సిన అవసరాలను బిల్లులో పొందుపరిచస్తే ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వారి అభిప్రాయాలను క్రోడీకరించి మళ్లీ బిల్లులో జత చేస్తామని.. అప్పుడు సభ ముందుకు వస్తామని తెలిపారు.

కోర్టు జోక్యం లేకుండా ప్రభుత్వం చట్టం చేయాలనుకుంటోందనేది ఊహాజనితం అని పేర్ని నాని కొట్టిపారేశారు. ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటూ కోర్టులు వ్యతిరేకంగా వచ్చినా మేం వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది మోడీ ప్రభుత్వం.. మేం అలా చేయలేదని.. ఇది జగన్ ప్రభుత్వమని.. ఆకాంక్షలను మళ్లీ నెరవేర్చేలా బిల్లు తయారు చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

ఇక ఏపీ మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై స్పందించారు. అందరితో చర్చించిన తర్వాతే వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామన్నారు. అనేక అపోహలు, అభిప్రాయ భేదాల వల్లే అమల్లో విభేదాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు.