Begin typing your search above and press return to search.
రోజా ప్రొటోకాల్ వివాదంపై మంత్రుల స్పందన!
By: Tupaki Desk | 19 Jan 2021 3:53 PM GMTతన నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడంలేదని, తనను అవమానిస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తననెవరూ పట్టించుకోవటం లేదంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో రోజా కంటతడి పెట్టుకున్న ఘటన ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. రోజాను చిత్తూరుకు చెందిన కొందరు వైసీపీ నేతలు తొక్కేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
రోజా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై నారాయణ స్వామి స్పందించారు. తనకు గ్రూపు రాజకీయాలు తెలీదన్న నారాయణ స్వామి...తనకు ఎవరితోనూ విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. తాను అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్నవాడినని, రోజా వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, ఈ వివాదంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా స్పందించారు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమని, పార్టీలో చిన్న చిన్న గొడవలు జరిగి సమసి పోతుంటాయని, అంత మాత్రాన అవి నాయకుల మధ్య విభేదాలు కావని చెప్పారు. అధికారులకు, నాయకులకు మధ్య విభేదాలు లేవన్నారు. కాగా, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవినిచ్చారని, దీంతో, ఆమె అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఆ పదవితో రోజాకు తగినంత గుర్తింపు రాకపోగా....ఎమ్మెల్యేగా ప్రొటోకాల్ కూడా పాటించకపోవడంతో ఆమె తీవ్ర నిరాశతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రోజా కన్నీటి వెనుక అధికార పార్టీ నేతలు, చిత్తూరు జిల్లా మంత్రులు ఉన్నారన్న వదంతులు వస్తున్నాయి. మరి, ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.