Begin typing your search above and press return to search.

మద్యానికి నిషేధిస్తే ఎలా ... మంత్రి సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   11 Jan 2020 2:56 PM IST
మద్యానికి నిషేధిస్తే ఎలా ... మంత్రి సంచలన వ్యాఖ్యలు !
X
మద్యం.. ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్న ఘోరాలకి ప్రధానమైన కారణం. దీనితో చాలామంది మద్యాన్ని పూర్తిగా నిషేదించాలని కోరుతున్నారు. మద్యానికి బానిసగా మారి కుటుంబాలని రోడ్డున పడేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు , పెద్దవారు అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మద్యానికి బానిసై పోతుండటంతో మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో మద్య నిషేధానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

మద్యాన్ని నిషేధించడం కుదరదు అని చెప్పిన అయన .. మద్యం సేవించమని ఎవరినీ బలవంతం చేయడం లేదు కాబట్టి మద్యంపై నిషేధం ఉండకూడదని అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన తిండి తినేందుకు,తాగేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. అంతేకాదు, వైద్య చికిత్స తీసుకునేటప్పుడు కొంతమంది పేషెంట్లకు మద్యం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. తన మిత్రుడు ఒకరు ప్రతీ రోజూ రాత్రి ఒక పెగ్గు తీసుకుంటాడని, లేదంటే ఆరోజు రాత్రి అతనికి నిద్ర పట్టదని చెప్పారు. ఆ ఒక్క పెగ్గు వల్ల రాత్రిపూట మంచి నిద్ర పట్టడంతో పాటు ఉదయం కూడా యాక్టివ్‌గా ఉంటారని అన్నారు.కొంతమంది పేషెంట్లకు వైద్యులే సలహా ఇస్తుంటారని, తక్కువ మొత్తంలో రోజూ ఒక పెగ్గు తీసుకోవాలని చెబుతుంటారని గోవింద్ సింగ్ అన్నారు

వ్యక్తుల ఆహారపు అలవాట్లు, డ్రింకింగ్ అలవాట్లపై తామెలాంటి నిషేధాలు పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవల కమలనాథ్ సర్కార్ మధ్యప్రదేశ్‌ లోని లిక్కర్ కాంట్రాక్టర్లకు సబ్ షాప్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో లిక్కర్ మాఫియాకు సీఎం న్యూ ఇయర్ కానుక ఇచ్చారంటూ మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్ చౌహాన్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌ ను మదిరప్రదేశ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు. అయితే అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు తాము సబ్ షాప్స్‌ కు అనుమతిచ్చామని మంత్రి గోవింద్ సింగ్ చెబుతున్నారు.