Begin typing your search above and press return to search.

చెల్లెల్ని గదిలో పెట్టి బంధించి..అక్కపై అత్యాచారం చేసిన మైనర్

By:  Tupaki Desk   |   23 Aug 2019 5:35 AM GMT
చెల్లెల్ని గదిలో పెట్టి బంధించి..అక్కపై అత్యాచారం చేసిన మైనర్
X
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. దీని గురించి విన్నంతనే ఇంట్లో ఆడపిల్లల్ని ఒంటరిగా ఉంచటం కూడా మంచిది కాదేమోనన్న భయాందోళనలు వ్యక్తం కావటం ఖాయం. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

చాంద్రాయణగుట్ట పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలో చాంద్రాయణగుట్టలో ఒక కుటుంబం ఉంటోంది. తల్లి.. అన్నాచెల్లెళ్లు ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో పెద్దవాళ్లు లేరు. ఇంటి తలుపు తీసి ఉంది. అంతే.. 17 ఏళ్ల ఒక మైనర్ బాలుడు ఇంట్లోకి ప్రవేశించాడు. పదహారేళ్ల బాలికను బెడ్రూంలోకి లాక్కెళ్లాడు. దీన్ని గమనించిన చెల్లెలు.. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది.

దీంతో.. సదరు బాలుడు ఆమెను లాక్కెళ్లి మరో గదిలో బంధించాడు. అనంతరం పదహారేళ్ల బాలికను మరో గదిలోకి తీసుకెళ్లి.. రేప్ చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి.. సోదరులు జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. పారిపోయిన మైనర్ బాలుడ్ని పట్టుకున్న పోలీసులు అతడ్ని జువైనల్ హోంకు తరలించారు.