Begin typing your search above and press return to search.

ప్రియుడితో లేచిపోవడానికి బాలిక దారుణం

By:  Tupaki Desk   |   13 Sept 2019 11:17 AM IST
ప్రియుడితో లేచిపోవడానికి బాలిక దారుణం
X
తెలిసి తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమ అనుకొని దారుణాలకు పాల్పడుతున్నారు నేటి యువతరం.. నిండా 18 ఏళ్లు కూడా నిండని ఓ మైనర్ ఏకంగా ప్రియుడితో లేచిపోవడానికి తనను కని పెంచిన కుటుంబ సభ్యులకే విషమిచ్చిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లో చోటుచేసుకుంది.

మొరాదాబాద్ కు చెందిన 16 ఏళ్ల బాలికను అదే గల్లీలో ఉండే అర్వింద్ అనే యువకుడు ప్రేమ అంటూ ముగ్గులోకి దించాడు. ఆమెను లోబరుచుకున్నాడు. దీనిపై ఇదివరకే బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిపై అర్వింద్ అత్యాచారం చేశాడని కేసు పెట్టాడు. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన యువకుడు.. తనను జైలుకు పంపిన బాలిక తండ్రి, ఇద్దరు సోదరులపై పగ పెంచుకున్నాడు.

జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన అర్వింద్ తాజాగా బాలికకు మాయమాటలు చెప్పి లేచిపోవడానికి ప్లాన్ చేశాడు. వీళ్లు మన పెళ్లిని అడ్డుకుంటారని.. వారికి విషం ఇచ్చేయమని బాలికను పురిగొల్పాడు. ఇంట్లో అందరూ తినే ఆహారంలో బాలికను విషం కలుపమన్నాడు. బాలిక కలిపేసింది. ఇంటిసభ్యులంతా తిని అపస్మారక స్తితిలోకి వెళ్లిపోయారు. దీంతో బాలిక ప్రియుడితో కలిసి పారిపోయింది. తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో అతడు సేఫ్ అయ్యారు. తండ్రి తిరిగి వచ్చి చూసే సరికి కుటుంబసభ్యులంతా విగతజీవులుగా పడి ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బతికి బట్టకట్టారు.

కూతురే ఈ ఘాతుకం చేసిందని తెలిసి కుటుంబ సభ్యులు భోరుమన్నారు. కూతురు, చేయించిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రేమ జంట కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రియుడి కోసం కన్న కుటుంబానికే విషం ఇచ్చిన బాలిక వ్యవహారం సంచలనంగా మారింది.