Begin typing your search above and press return to search.
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఎపిసోడ్ లోకి హోం మంత్రిమనమడి పేరు ఎలా వచ్చింది?
By: Tupaki Desk | 4 Jun 2022 3:29 AM GMTతెలంగాణ పోలీసులకు ఇప్పుడో పెద్ద చిక్కు వచ్చి పడింది. అసలు ఎలాంటి తప్పు చేయకున్నా.. తమ శాఖకు బిగ్ బాస్ అయిన రాష్ట్ర హోం మంత్రి మనమడి పేరు తెర మీదకు రావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. గతంలో కొన్ని సంచలన అంశాల సమయంలో అతడి పేరు వచ్చినప్పటికీ.. తాజాగా వెలుగు చూసిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతంలో అతడి పాత్రను చెప్పే ఆధారం ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ.. ఆయన పేరును తెర మీదకు తేవటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉండి ఉంటుందన్నఅంచనా వేస్తున్నారు.
గ్యాంగ్ రేప్ ఉదంతంపై హోం మంత్రి మనమడి పేరును తీసుకురావటం వెనుక అయితే రాజకీయ నేతల అత్యుత్సాహం కానీ.. కొన్ని మీడియా సంస్థల అతి కానీ కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. హోం మంత్రి మనమడు సీన్లో ఉండి ఉంటే.. వారిని కాపాడటం హోం మంత్రికి కూడా లేని పరిస్థితి.
ఆ మాటకు వస్తే.. ఈ దారుణ ఘటనకు కారణమైన పబ్ మొదలు.. బేకరీ వరకు కూడా సీసీ కెమేరాల ఫీడ్ ను జల్లెడ పట్టిన సందర్భంలోనూ ఎక్కడా హోం మంత్రి మహమూద్ అలీ మనమడి జాడ లభించలేదు.
అయినప్పటికీ.. అతగాడి పేరును లాగటం చూస్తే.. రాజకీయ కారణాలతోఆయన పేరును బద్నాం చేస్తున్నారన్న మాట విపిస్తోంది. ఈజీగా నమ్మేసేలా కొన్ని అబద్ధాల్నిప్రచారం చేయటంలో కొందరు తమ టాలెంట్ ను ప్రదర్శిస్తుంటారు. తాజా ఎపిసోడ్ లోనూ అదే తీరును ప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలన్న ఉద్దేశంలో ఇలాంటివి చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంచలనంగా మారటం.. టీ హోం మంత్రి మనమడు ఇందులో ఉన్న కారణంగానే పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాత్రి తొమ్మిది గంటల వేళలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మనమడికి.. ఈ ఉదంతానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా చూస్తే..రాజకీయ శత్రుత్వంలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.