Begin typing your search above and press return to search.
చిన్నారి డౌట్ తో ఉలిక్కిపడిన డాబర్ కంపెనీ
By: Tupaki Desk | 17 Feb 2017 9:52 AM GMTతొమ్మిదేళ్ల చిన్నపాప అడిగిన ఒక ప్రశ్న ఓ పెద్ద కంపెనీ వివరణ ఇవ్వాల్సి రావటమే కాదు.. ఏకంగా తమ ప్యాకింగ్ ను మార్చకునేలా చేసింది. ఆసక్తికరమైనఈ ఉదంతంలోకి వెళితే.. ప్రముఖ దేశీయ కంపెనీ అయిన డాబర్.. రియల్ బ్రాండ్ పేరిట ఫ్రూట్ జ్యూసుల్ని అమ్ముతుంటుంది. చిన్న టెట్రా ప్యాకెట్ నుంచి లీటర్ టెట్రా ప్యాకెట్ వరకూ అమ్మే ఈ బ్రాండ్ సేల్స్ బాగుంటాయన్న పేరుంది.
అసోంలోని గువహటికి చెందిన తొమ్మిదేళ్ల పాప రియల్ పాకెట్ ను తాగటానికి ఒప్పుకోలేదు. ఎందుకిలా అంటే.. ఆ పాకెట్ మీద అబ్బాయి బొమ్మతో పాటు.. అబ్బాయిలు తాగే డ్రింక్ అన్న అర్థంతో ఉన్న క్యాఫ్షన్ ను క్వశ్చన్ చేసింది. అదే విషయాన్ని తన తండ్రికి అడిగింది కూడా. కూతురు అడిగిన ప్రశ్నతో ఉలిక్కిపడిన తండ్రి.. ఫ్రూట్ జ్యూస్ పాకెట్ మీద ఉన్న మ్యాటర్ ను చదివారు ‘‘ఏదైతే మీ చిన్నారికి మంచిదో.. అది అతడి ముఖంలో చిరునవ్వు కూడా తేవాలి’’ అని ఉండటంతో.. తన కూతురి సందేహాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీకి లేఖ రూపంలో వివరించారు.
జ్యూస్ పాకెట్ అబ్బాయిలకేనా? అన్న ప్రశ్నకు తాను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదని పాప తండ్రి మజుందార్ పేర్కొన్నారు. ఆమె ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రియాక్ట్ అయిన డాబర్.. తమ కంపెనీ లింగ వివక్షను అంగీకరించదని.. జనరల్ సెన్స్ లో ‘అతడు’ అని వాడామే కానీ.. తమకు వేరే ఆలోచన లేదని వివరణ ఇచ్చింది. అంతేకాడు.. ప్యాకింగ్ కూడా మార్చేసి.. కుటుంబం మొత్తం ఉండేలా రూపొందిస్తామని వెల్లడించింది. ఒక చిన్న పాపకు వచ్చిన సందేహం.. చివరకు ప్యాకింగ్ మార్చే వరకూ వెళ్లటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/