Begin typing your search above and press return to search.

జీతం కోసం కోరిక తీర్చాలి.. వెలుగులోకి దారుణాలు

By:  Tupaki Desk   |   9 July 2020 1:30 AM GMT
జీతం కోసం కోరిక తీర్చాలి.. వెలుగులోకి దారుణాలు
X
భారత్ అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ అభివృద్ధిలో ఓ వైపు దూసుకుపోతుంటే.. మరోవైపు దేశంలో ఇంకా పేదరికం, ఆకలి కోసం ఒళ్లు అమ్ముకుంటున్న బాలికల దైన్యం కన్పిస్తోంది. ఆకలి భరించలేక జీతం కోసం మరో దారి లేక శరీరాలను యజమానులకు అప్పగిస్తున్న దుస్థితి మనదేశంలోనే ఉంది. వాళ్ల కోరిక తీరిస్తే తప్ప జీతం ఇవ్వని యజమానులున్నారు. పేదరికంతో పూట గడవని ఆ బాలికలు బుక్కెడు బువ్వ కోసం తమ శీలాలను యజమానులకు అర్పిస్తున్న దైన్యం వెలుగుచూసింది.

తాజాగా ఓ ప్రముఖ జాతీయ చానెల్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఈ దారుణాన్ని కళ్లకు కట్టింది. యూపీ రాజధాని లక్నోకు 700 కి.మీల దూరంలోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో చిత్రకూట్ జిల్లా ఉంది. అక్కడ మైనర్ గిరిజన బాలికలు పేదరికం కారణంగా చదువులు మానేసి అక్కడి గనుల్లో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. అయితే కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు వీరికి జీతం ఇవ్వకుండా లైంగిక కోర్కెలు తీరిస్తేనే ఇస్తామని మెలికపెడుతున్నారు. దీంతో పూట గడవని పరిస్థితుల్లో వారి శీరీరాలను కూడా ఆకామాంధులకు ఇస్తూ సగమే జీతం తీసుకుంటున్న దౌర్భాగ్యం అక్కడ వెలుగుచూసింది.

దాదాపు 12-14 ఏళ్ల మైనర్ బాలికలు గనుల్లో పనిచేస్తున్నారు. వీరికి రోజుకు కూలీ 200-300 వస్తాయి. కానీ అవి కూడా ఇవ్వకుండా లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారట.. అత్యాచారం చేశాక రూ.150 చేతిలో పెట్టి పంపిస్తున్నారట.. కూలీ చేస్తే తప్ప పొట్టపోసుకోని తాము డబ్బుల కోసం ఒళ్లను వారికి ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది ఆ బాలికలు వాపోతున్నారు. ఒక్కోనాడు ఇద్దరు యజమానులు కూడా తమపై లైంగిక దాడి చేస్తారని ఆ బాలికలు వాపోతున్నారు.

ఒప్పుకోని బాలికలను కొండపై నుంచి విసిరేసి చంపేస్తామని.. జీతం ఇవ్వమని బెదిరించడంతో ఆ బాలికలు ఒళ్లు అమ్ముకుంటూ పనిచేసుకుంటూ అక్కడి గనుల్లో బతుకుతున్నారు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసినా పేదరికంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి వారిది.లాక్ డౌన్ లో పనిలేక ఈ లైంగిక దోపిడీ యూపీలోని బుందేల్ ఖండ్ లో చోటుచేసుకుంది.

జాతీయ మీడియాలో వచ్చిన ఈ కథనం యూపీ సర్కార్ ను షేక్ చేసింది. వెంటనే విచారణకు ఆదేశించి ఆ బాలికలను ఆదుకుంటామని సర్కార్ ప్రకటించింది.