Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఇంగ్లిషే రాదు.. మంత్రి ఎద్దేవా!

By:  Tupaki Desk   |   11 Nov 2019 10:53 AM GMT
చంద్రబాబుకు ఇంగ్లిషే రాదు.. మంత్రి ఎద్దేవా!
X
ఒకవైపు చంద్రబాబు నాయుడు తను దేశంలోనే అతి సీనియర్ నేత అని చెప్పుకుంటూ ఉంటారు. పద్నాలుగేళ్ల పాటు సీఎంగా చేసినట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. తనకు మించిన అనుభవజ్ఞుడు లేడని కూడా ఆయన తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ఉంటారు. జగన్ పాలనపై కూడా చంద్రబాబు నాయుడు అనుభం లేదంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆఖరికి అబ్దుల్ కలాం కూడా తన నుంచినే విజన్ ను నేర్చుకున్నారని చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించుకోవడం కామెడీగా నిలిచింది.

ఇక అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లు తను చెప్పడం వల్లనే ఇంగ్లిష్ నేర్చుకున్నారని కూడా చంద్రబాబు నాయుడు ఆ మధ్య సెలవిచ్చారు. ఇదంతా చంద్రబాబు నాయుడి స్వోత్కర్ష!

ఆ సంగతలా ఉంటే..ఒకవైపు ప్రభుత్వ పాఠ శాలల్లో ఇంగ్లిష్ చదువులపై వాదోపవాదాలు సాగుతున్న వేళ ఏపీ మంత్రి ఒకరు చంద్రబాబు నాయుడి ఇంగ్లిష్ గురించి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకు ఇంగ్లిష్ రాదని ఎద్దేవా చేశారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వచ్ఛమైన ఆంగ్లంలో, ధారాళంగా మాట్లాడగలరని, అయితే చంద్రబాబు నాయుడుకు ఇంగ్లిష్ రాదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడిది 'బ్రీఫ్డ్ ' ఇంగ్లిష్ అని ఎద్దేవా చేశారు.

ఒక ఫోన్ టేపుల్లో చంద్రబాబు నాయుడు 'మనవాళ్లు బ్రీఫ్డ్ మీ' అంటూ వ్యాఖ్యానించిన వైనాన్ని సురేష్ ప్రస్తావించారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూంటే, ఆయనకు ఇంగ్లేషే రాదు ఆయనేం చేయగలరు? అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మరి ఈ విమర్శలకు చంద్రబాబు నాయుడు ఇంగ్లిష్ లో మాట్లాడి సమాధానాలు ఇస్తారా? లేక కామ్ గా ఉండిపోతారా!