Begin typing your search above and press return to search.

వైద్య చరిత్రలోనే అద్భుతం.. ఎయిడ్స్ జయించాడు

By:  Tupaki Desk   |   12 March 2020 12:30 PM GMT
వైద్య చరిత్రలోనే అద్భుతం.. ఎయిడ్స్ జయించాడు
X
ప్రపంచంలోనే మందు లేని రోగాల్లో ఎయిడ్స్ అన్నింటికంటే డేంజర్. ఎప్పుడో 80వ దశకం లో వెలుగుచూసిన ఈ వ్యాధికి వైద్యులు ఇప్పటికీ మందులు కనిపెట్టలేదు. ఇప్పుడు కరోనా వైరస్ కు కూడా మందు లేక చాలా మంది చనిపోతున్నారు.

ఎయిడ్స్ వ్యాధి సోకితే ఇక మరణమే. జీవితంపై ఆశలు వదులుకోవాల్సిందే.. కొన్ని సంవత్సరాల తర్వాత మరణిస్తారు. అయితే ఓ యువకుడు మాత్రం అద్భుతం సృష్టించాడు. వైద్య చరిత్రలోనే ఎయిడ్స్ ను జయించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.

లండన్ కు చెందిన ఆడమ్ క్యాసిల్లెజో.. తనకు హెచ్ఐవీ సోకిన 30 నెలల తర్వాత దాని నుంచి బయటపడడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎయిడ్స్ పోవడం తో అప్పటి వరకూ చేయించుకున్న యాంటీ రిట్రోవైరల్ థెరపీ కూడా ఆపు చేయించాడు.

అయితే అతడు మందుల ద్వారా ఎయిడ్స్ ను తగ్గించుకోలేదు. కణజాల ట్రీట్ మెంట్ ద్వారా ఎయిడ్స్ ను జయించాడు. యువకుడికి క్యాన్సర్ ఉండడం తో ట్రీట్ మెంట్ చేశారు. ఎవరో దాత కణజాలం ఇచ్చారు. ఆ దాతకు ప్రత్యేకమైన జన్యువులున్నాయి. వాటికి హెచ్ఐవీ నుంచి కాపాడే లక్షణం ఉంది. అవి యువకుడి శరీరంలో చేరాక హెచ్ఐవీని తరిమికొట్టాయి.

2011 లో కూడా తిమోతీ బ్రౌన్ అనే జర్మనీ వ్యక్తి ఎయిడ్స్ నుంచి తొలిసారిగా బయటపడ్డాడు. ఇప్పుడు 40 ఏళ్ల ఆడమ్ కూడా రెండో వ్యక్తిగా నిలిచాడు. ఎయిడ్స్ రోగులకు ఈ చికిత్స ఇప్పుడు వరంగా మారనుంది.