Begin typing your search above and press return to search.
వైద్య రంగంలో మహాద్భుతం !
By: Tupaki Desk | 3 May 2022 8:30 AM GMTఇదో అద్భుతమనే చెప్పాలి. వైద్య రంగంలో కొందరు వైద్యులు చేస్తున్న పరిశోధనలు ఫలించి.. అనూహ్య ఫలితాలు రావటం ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇన్ ఫెక్షన్ కారణంగా ఎనిమిదేళ్ల క్రితం పురుషాంగాన్ని కోల్పోయిన వ్యక్తికి ఒక బ్రిటన్ వైద్యుడు చేతి మీద ఆ అంగాన్ని మొలిపించటమే కాదు.. దాన్ని దాని స్థానంలో అతికించిన అద్భుతం తాజాగా చోటు చేసుకుంది. తొమ్మిది గంటల పాటు సాగిన సుదీర్ఘ శస్త్రచికిత్సతో వైద్య రంగంలో మరో నమ్మలేని నిజం నమోదైంది.అసలే జరిగిందన్న విషయంలోకి వెళితే..
బ్రిటన్ కు చెందిన 45 ఏళ్ల మల్కమ్ డోనాల్డ్ అనే వ్యక్తికి 2014లో పెరీనియం ఇన్ ఫెక్షన్ కారణంగా తన పురుషాంగాన్ని కోల్పోయారు. మల ద్వారానికి.. వృషణానికి మధ్యనున్న ప్రదేశంలో ఇన్ ఫెక్షన్ చోటు చేసుకుంది. దీంతో విపరీతమైన బాధకు గురైన అతనికి సెప్సిస్ కు దారి తీసింది. దీని కారణంగా అతడి చేతి వేళ్లు.. కాలి వేళ్ల నుంచి పురుషాంగానికి రక్త సరఫరా తగ్గిపోయి అవి నల్లగా మారాయి.
2014లో అతను కలలో కూడా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక రోజున అతని పురుషాంగం.. ఒక్కసారిగా ఊడి కిందకు పడిపోయింది. నోట్లో పన్ను ఎలా ఊడుతుందో.. అలా అన్నమాట. కానీ.. వృషణాలు మాత్రంఅలానే ఉన్నాయి. కింద పడిన వృషణాలను డస్ట్ బిన్ లో వేసి.. ఆసుపత్రికి వెళ్లాడు. వారేమీ చేయలేమంటూ చుట్టూ గుడ్డ కట్టారు. అలా రెండేళ్ల పాటు తీవ్రమైన వేదనకు గురయ్యాడు. దీనికి తోడు ఈ ఇన్ ఫెక్షన్ అంతకంతకూ ఎక్కువ అవుతూ.. చేతి వేళ్లు.. కాలి వేళ్లకు పాకటంతో ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యాడు. ఇలానే వదిలేస్తే.. కొన్నాళ్లకు అవి కూడా అలానే అవుతాయని భావించాడు. దీనికి తోడు మద్యానికి బానిస అయ్యాడు. ఎవరిని కలిసేందుకు అతను ఇష్టపడేవాడు కాదు.
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ డేవిడ్ రాల్స్ అనే ప్రొఫెసర్ గురించి చెప్పారు. ఆయన లండన్ వర్సిటీ కాలేజీలోని ఆసుపత్రిలో పురుషాంగ నిపుణుడిగా అతనికి మంచి పేరుంది. ఆ మాటకు వస్తే ఆయన్ను.. పెనిస్ మాస్టర్ గా చెబుతుంటారు. పురుషాంగం లేకుండా పుట్టిన ఒక వ్యక్తికి బయోనిక్ పురుషాంగాన్ని అమర్చిన సత్తా ఆయన సొంతమన్న విషయాన్ని తెలుసుకున్నాడు మల్కమ్. దీంతో అతనిలో కొత్త ఆశలు చిగురించాయి. వెంటనే వెళ్లి కలిశాడు. అతన్ని పరీక్షించిన ఆయన.. అతడి చేతి మీద అంగాన్ని మొలిపించొచ్చని.. కాకుంటే అదో సుదీర్ఘమైన ప్రక్రియ అని.. అందుకు రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు.
అంతేకాదు రూ.50 లక్షల ఖఱ్చు అవుతుందని పేర్కొన్నాడు. ఆ ఖర్చుకు మల్కమ్ ఓకే అని చెప్పటంతో అతడి అంగానికి సంబంధించిన రక్త నాళాలు..నాడుల్ని సేకరించి.. అతడి ఎడమ చేతి మీద చర్మాన్ని చుట్టి మూత్ర మార్గాన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే అతడి చేతి మీద అంగాన్ని మొలిపించటానికి రెండేళ్లు పడుతుందనుకుంటే.. అది కాస్తా నాలుగేళ్లు పట్టింది. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని చెప్పాలి.
కొత్తగా మొలిపించుకునే పురుషాంగం ఏ సైజులో ఉండాలన్నది కోరుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా అతడిది నాలుగు అంగుళాలు ఉంటే.. పట్టుబట్టి మరీ ఆరు అంగుళాల పురుషాంగాన్ని కోరుకున్నాడు. అందుకోసం రూ.15 లక్షలు అదనంగా ఖర్చుకు వెనుకాడలేదు. అందుకే.. తనలాంటి డిజైనర్ పురుషాంగం ఎవరికీ ఉండదని చెబుతాడు. తన చేతి మీద మొలిపించుకున్న పురుషాంగానికి జిమ్మీఅన్న పేరు పెట్టుకున్నట్లు చెబుతాడు.
అలా మొలిపించుకున్న పురుషాంగాన్ని సర్జరీతో దాని స్థానంలో పెట్టే శస్త్రచికిత్సను 2019లో అనుకున్నా కుదర్లేదు. ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అడ్డంకి వచ్చి పడేది. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ల సాధ్యం కాలేదు. అలాంటి అతడికి ఈ మధ్యనే సర్జరీ చేశారు. అతనుతన కొత్త అవయువంతో మూత్ర విసర్జన మాత్రమే కాదు.. సెక్సు కూడా చేయగలడు. అందుకు వీలుగా వైద్యులు రెండు ట్యూబులు అమర్చారు. ఆ అంగాన్నియాంత్రికంగా స్తంభింపజేసేందుకు ఒక హ్యాండ్ పంప్ కూడా ఇచ్చారు.