Begin typing your search above and press return to search.

రేసింగ్ లకు అదిరిపోయే రోడ్లు.. మాకేవి సార్లు

By:  Tupaki Desk   |   21 Nov 2022 7:31 AM GMT
రేసింగ్ లకు అదిరిపోయే రోడ్లు.. మాకేవి సార్లు
X
అటు ఏపీ అయినా.. ఇటు తెలంగాణ అయినా ఏ రోడ్లు చూసినా గుంతలమయమే.. తెలంగాణ కాస్త బెటర్ అనుకోవాలి. ఇక సోకులకు పోయి కాస్త రాజధాని, నగర రహదారులను బాగానే వేస్తున్నారు. కానీ అంతర్గత, వీధుల దారులు మాత్రం గతుకుల బొంతలే. ఏపీలో అయితే రోడ్లు నరకానికి నకల్లుగా ఉంటాయి. తెలుగురాష్ట్రాలను వేధిస్తున్న ప్రధాన సమస్య 'రహదారులే' అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లు పెట్టి నిర్మించినా ఒక్క వానకే కొట్టుకుపోయేవి ఎన్నో.. నాసిరకం రోడ్లతో జనాలు నరకం అనుభవిస్తున్నారు.

మన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు రోడ్లు సరిగా వేయడం చేతకాదనేది చాలా మంది అభిప్రాయం. అయితే ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం హైదరాబాద్ లో చిన్న గుంత కూడా లేకుండా రోడ్లు అద్భుతంగా వేశారు. అవి చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.

సోకుల కోసం.. రేసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టడం చూసి అవాక్కవుతున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్టు.. మీ ప్రతిష్ట కోసం రోడ్లు బాగా వేసుకుంటారా? మా గల్లీలు, రహదారులను పట్టించుకోరా? అని నిలదీస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుంతల్లేని రోడ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ రేసింగ్ రోడ్లు చూసి ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియాలో ఇదే కామెంట్ చేస్తున్నారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని.. వారి కోసం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటూ హితవు పలుకుతున్నారు.

ముఖ్యంగా ట్విటర్ లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ కు ఈ మేరకు ట్యాగ్ చేసి మరీ నిలదీస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఈ రేసింగ్ ను మొదలుపెట్టింది ఆయనే. అందుకే ఆయన్ను టార్గెట్ చేసి మరీ నిలదీతలు కొనసాగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.