Begin typing your search above and press return to search.

అసలు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా ?

By:  Tupaki Desk   |   27 Oct 2021 6:44 AM GMT
అసలు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా ?
X
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందు కు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం గా ఉంది. క్రూజ్ షిప్ లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటనలో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్+మరికొందరు పట్టుబడిన విషయం దేశంలోనే సంచలనం సృష్టించింది. అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ పట్టుబడిన దగ్గర నుండి ఇప్పటికీ జ్యుడీషియల్ రిమాండ్ లోనే ఉన్నారు. కొడుకుకు ఎలాగైనా బెయిల్ తెప్పించాలని షారుక్ చేస్తున్న ప్రయత్నాలు చాలాసార్లు ఫెయిలయ్యాయి.

ఆర్యన్ దగ్గర మాదక ద్రవ్యాలు దొరక్క పోయినా అతని మొబైల్ నుండి అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు వాట్సప్ ద్వారా చాటింగ్ జరిపినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కోర్టుకు చెప్పింది. చాటింగ్ వివరాలన్నింటినీ కోర్టులో సమర్పించిన తర్వాతే ఆర్యన్ పై కేసు మరింత బలం గా తయారైంది. ఇందుకనే ఆర్యన్ కు బెయిల్ ఇవ్వటానికి కోర్టు నిరాకరిస్తోంది. సరిగ్గా ఈ సమయం లోనే ఆర్యన్ కు బెయిల్ ఇవ్వటానికి రు. 25 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు తెర పైకి వచ్చాయి.

ఆరోపణన్నీ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే టార్గెట్ గానే మొదలయ్యాయి. కేసు నీరుగార్చేందుకు డిమాండ్ చేసిన రు. 25 కోట్లలో వాంఖడేకు రు. 8 కోట్లివ్వాలని ఎన్సీబీ ఆఫీసులో మాట్లాడుకుంటుంటే తాను విన్నట్లుగా ఒక సాక్షి తెర పైకి వచ్చారు. దాంతో బెయిల్ విషయం లో ముడుపుల ఆరోపణలతో దేశం లో ఒక్కసారి గా సంచలనం మొదలైంది. దీని పై ఎన్సీబీ ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఆరోపణలు ఇలా ఉండగానే అసలు వాంఖడే హిందువే కాదని ముస్లిమంటు మహా రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.

ఈ ఆరోపణలు ఇలాగుండగానే షారుక్ తో పాటు అనేక మంది బాలివుడ్ ప్రముఖుల ఫోన్లను వాంఖడే ట్యాపింగ్ చేయిస్తున్నట్లు మళ్ళీ నవాబ్ ఆరోపణలు చేశారు. చివర కు తన కుమార్తె కాల్ డీటైల్స్ కావాలని కూడా వాంఖడే పోలీసుల ను కోరి నట్లు మంత్రి మండిపోయారు. జరుగుతున్నదంతా చూస్తుంటే ఆర్యన్ కు బెయిల్ అనే అసలు కేసు ను తప్పుదోవ పట్టించేందు కే ఆరోపణల తో ప్రయత్నాలు జరుగుతున్నాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

లేకపోతే వాంఖడే హిందు వైతే ఏమిటి ? ముస్లిం అయితే ఏమిటి ? కేసు దర్యాప్తును ఎంత పకడ్బందీగా చేస్తున్నారనేదే ముఖ్యం. నిజంగానే ఆర్యన్ కు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా లేవా అన్నదే ఇక్కడ కీలకం. బాలీవుడ్ స్టార్ల తో డ్రగ్స్ కు సంబంధించి ఆర్యన్ చాటింగ్ చేశారా లేదా అన్నదే చూడాలి. హీరోయిన్ అనన్యపాండే మొబైల్లో ఆర్యన్ తో నడిపిన చాలా చాటింగులు డిలీట్ అయినట్లు ఎన్సీబీ గుర్తించింది. క్షేత్రస్ధాయి లో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే విచారణను తప్పుదోవ పట్టించి, వాంఖడేను ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.