Begin typing your search above and press return to search.

మిస్​ఇండియా రన్నరప్​ మాన్యాసింగ్​.. ఎన్నికష్టాలు పడిందో తెలిస్తే కళ్ల చెమ్మగిల్లుతాయి..!

By:  Tupaki Desk   |   12 Feb 2021 10:41 AM GMT
మిస్​ఇండియా రన్నరప్​ మాన్యాసింగ్​.. ఎన్నికష్టాలు పడిందో తెలిస్తే కళ్ల చెమ్మగిల్లుతాయి..!
X
తెలంగాణకు చెందిన మానస వారణాసి ఫెమీనా మిస్ ఇండియా 2020 నిలిచిన విషయం తెలిసిందే. ఇదే పోటీలో ఉత్తరప్రదేశ్​కు చెందిన మాన్యా సింగ్‌ రన్నరప్​గా నిలిచారు. అయితే
మాన్యాసింగ్​ ఈ స్థాయికి ఎలా వచ్చారో? ఆమె ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నదో మీడియాకు చెప్పారు.
మాన్యాసింగ్​ జీవితం పూలపాన్పు కాదు. ఆమె ఓ ఆటోడ్రైవర్​ కూతురు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అంట్లుతోమారు. కాల్​సెంటర్​లో పనిచేశారు. 5 రూపాయలు మిగులుతాయని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేది. మాన్యాసింగ్​ ఈ స్థాయికి ఎలా వచ్చారో.. ఆమె మాటల్లోనే..

‘నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నా రక్తం, చెమట, కన్నీళ్లు అన్ని నూరిపోసుకొని ధైర్యంగా ఎదిగాను. మా స్వస్థలం ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్. మా నాన్న ఆటోడ్రైవర్​గా పనిచేసేవారు. ఇళ్లు గడవడమే చాలా కష్టంగా ఉండేది. నాజీవితంలో చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. అందుకు కారణం రాత్రిపూట భోజనం లేకపోవడమే.

ప్రతిరోజు చాలా మైళ్ల దూరం నడుచుకుంటూ ఇంటికి వచ్చేదాన్ని. అలా మిగిలించుకున్న డబ్బుతో పుస్తకాలు కొనేదాన్ని. చదువు అనేది జీవితంలో ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. నేను చదువుకొనే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డాను. మా తండ్రి ఆటోడ్రైవర్​ అన్న కారణంతో చాలామంది ఫ్రెండ్స్​ నాతో మాట్లాడేవాళ్లు కాదు. స్కూల్​ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండేవి కావు.డబ్బుకోసం నేను సాయంత్రాల్లో ఇళ్లల్లో పనిచేసేదాన్ని. కాల్​సెంటర్​లో కూడా పనిచేశాను’ అని తన జీవిత విశేషాలను చెప్పుకున్నది మాన్య.