Begin typing your search above and press return to search.
అందుకే మాజీ మిస్ తెలంగాణ సూసైడ్ యత్నం!
By: Tupaki Desk | 29 Oct 2021 3:20 PM GMTఅందరూ తళకుబెళుకులే చూస్తారు.. చప్పట్లు కొడతారు. కానీ.. వెనుక ఉండే చీకటి మాత్రం పట్టించుకోరు. ఒకటి ఒకటిగా వచ్చి పడుతున్న సమస్యలకు పరిష్కారం వెతకలేక.. జీవితం మీద విరక్తి చెందిన మిస్ తెలంగాణ 2018 విజేత హాసిని ఆన్ లైన్ సాక్షిగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన వ్యక్తి ఒకరు డయల్ 100కు ఫోన్ చేసి అలెర్టు చేయటంతో ఆమెను రక్షించారు. ఇంతకూ ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
మోడల్ గా వ్యవహరిస్తున్న హాసిన ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన మిస్ తెలంగాణ 2018 విజేతగా నిలిచారు. హిమాయత్ నగర్ లోని ఒక అపార్ట్ మెంట్లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు.. స్నేహితులను ఇన్ స్టా వీడియో కాల్ చేశారు. కంగారు పడిన వారంతా ఆమెకు చెబుతున్న మాటల్ని పట్టించుకోకుండా తాను చెప్పాల్సింది చెప్పారు.
ఆత్మహత్య చేసుకోవటం తప్పని తెలసని.. తనకు ఎవరూ అవసరం లేదని.. ఒకసారి యాసిడ్ దాడి.. మరోసారి వేధింపులు.. ఎన్నోసార్లు రకరకాల వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని.. తల్లిదండ్రులు తనను మన్నించాలని కోరుతూ.. అందరికి గుడ్ బై ఫర్ ఎవర్ అంటూ కాళ్ల కింద స్టూల్ ను తన్నేశారు.
ఇదంతా చూస్తున్న ఆమె స్నేహితుడు ఒకరు డయల్ 100కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పి అలెర్టు చేశారు. సమాచారం విన్నంతనే నారాయణగూడ పోలీసులు ఆగమేఘాల మీద ఆమె ఉండే అపార్టుమెంట్ కు చేరుకున్నారు. తలుపులు బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. మెడకు బిగించుకున్న చున్నీ ముడి లక్కీగా వీడిపోవటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన్నట్లు చెబుతున్నారు. హాసినిది క్రిష్ణా జిల్లా వీర్లపాడు మండలం బోజ్వాడకు చెందిన వారుగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని.. తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లారు.