Begin typing your search above and press return to search.
మెక్సికో సుందరి సిగలో.. మిస్ యూనివర్స్!
By: Tupaki Desk | 17 May 2021 8:30 AM GMTఎవరికి దక్కుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూసిన ‘మిస్ యూనివర్స్’ కిరీట మెక్సికో సుందరి సిగను అలంకరించింది. పోటీపడిన సుందరాంగులందరినీ వెనక్కునెట్టిన మెక్సికో సోయగం ఆండ్రియా మెజా.. 2020 కిరీటాన్ని సగర్వంగా నెత్తికెత్తుకుంది.
కిరీటం దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడిన మిస్ ఇండియా అడ్లైన్ కాస్టెలినో.. రెండు అడుగుల దూరంతో చేజార్చుకుంది. ఈ పోటీల్లో కాస్టెలినో మూడో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కిరీటం దక్కించుకోలేనందుకు అభిమానులు బాధపడినా.. టాప్ త్రీలో నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో రెండవ స్థానంలో మిస్ పెరూ జెనిక్ మాచెట్టా నిలిచారు.
ఈ టైటిల్ ను దక్కించుకునేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 73 మంది హాజరయ్యారు. వీరందరినీ తోసిరాణి అని నిరూపించుకుంది మెక్సికో బ్యూటీ ఆండ్రియా. ఆ విధంగా.. 69వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఉద్విఘ్నంగా అందుకుంది.
ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సౌతాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ జోజిబిని తుంజీ.. విజేతకు కిరీటం అలంకరించారు. కాగా.. గతేడాది జరగాల్సిన ఈ పోటీలు.. కరోనా కారణంగా నిలిచిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడడంతో నిర్వహించారు.