Begin typing your search above and press return to search.

మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

By:  Tupaki Desk   |   17 Dec 2021 6:32 AM GMT
మిస్ ఇండియాకు కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
X
మిస్ ఇండియాకు కరోనా సోకడంతో ఏకంగా మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడడం సంచలనమైంది. మిస్ ఇండియా 2020 మానస వారణాసికి కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. భారతదేశానికి చెందిన మానస వారణాసితో సహా పలువురు పోటీదారులు కోవిడ్19 పాజిటివ్ బారిన పడడంతో మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదాపడ్డాయి. ఫినాలే డిసెంబర్ 16వ తేదీన ప్యూర్టోరికోలో జరగాల్సి ఉంది.

కరోనా కారణంగా మిస్ వరల్డ్ 2021 ముగింపు పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అయితే పోటీదారులు, సిబ్బంది, సాధారణ ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రయోజనాల కారణంగా నిర్వాహకులు ఈవెంట్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. తదుపరి 90 రోజుల్లో ప్యూర్టోరికోలోని జోస్ మిగ్యూల్ అగ్రెలాట్ కోలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.

మిస్ వరల్డ్ 2021 పోటీదారులతో సహా 17 మంది సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. కరోనా వచ్చిన వారిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మానస వారణాసి కూడా ఉన్నారు. పోటీదారులు, ప్రొడక్షన్ టీం సభ్యులు కరోనా బారినపడడం వల్ల ప్రేక్షకుల భద్రత కోసం మిస్ వరల్డ్ పోటీలు వాయిదా నిర్ణయం తీసుకున్నామని ఈవెంట్ ఆర్గనైజర్లు వివరించారు.

23 ఏళ్ల మానస వారణాసి 70వ ప్రపంచ సుందరి పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించనుంది. 2019వ సంవత్సరంలో జరిగిన పోటీల్లో జమైకా దేశానికి చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్ 2019 కిరీటాన్ని గెలుచుకుంది.