Begin typing your search above and press return to search.
తప్పిన భారీ ముప్పు.. గుర్ గ్రామ్ లో కూలిన ‘‘ఫ్లైఓవర్’’
By: Tupaki Desk | 23 Aug 2020 5:15 AM GMTఎన్ని దుర్ఘటనలు చోటు చేసుకున్నా.. నిర్మాణ వేళ కక్కుర్తి పడే విషయంలో మాత్రం తీరు మారటం లేదన్న విషయం గుర్తుకు వచ్చే ఉదంతం మరొకటి చోటు చేసుకుంది. రూల్ బుక్ లో నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒకటి పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.
శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.లక్కీగా శనివారం పండుగ రోజు కావటం.. కరోనా నేపథ్యంలో ట్రాఫిక్ పెద్దగా లేదు. ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిన ఫ్లైఓవర్ కారణంగా నిర్మాణంలోని సామాగ్రి పది మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ప్రమాద సమయంలో రద్దీ లేకపోవటంతో భారీ ప్రాణ నష్టం జరగలేదు.
సోహ్నా రోడ్డులో నిర్మిస్తున్నా ఎలివేటెడ్ కారిడార్ కూలినట్లుగా హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్తు చౌతాలా ట్విట్టర్ లో పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన విషయాన్ని తెలిసిన వెంటనే.. అధికారులు.. రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. నాణ్యతలోని లోపాల కారణంగానే ఫ్లైఓవర్ కూలినట్లుగా చెబుతున్నారు.