Begin typing your search above and press return to search.

బంగాళాఖాతంలో పేల్చిన క్షిపణి.. 6వ దేశంగా భారత్ ఆవిర్భావం

By:  Tupaki Desk   |   14 Oct 2022 4:40 PM GMT
బంగాళాఖాతంలో పేల్చిన క్షిపణి.. 6వ దేశంగా భారత్ ఆవిర్భావం
X
ప్రపంచంలోని అగ్రదేశాల సరసన భారత్ చేరింది. భారత అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ శుక్రవారం ఏకంగా శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి ఔరా అనిపించింది. ఇదో ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు. అంతకుముందు స్థిర నీటి అడుగున పాంటూన్ ల నుంచి పరీక్షా కాల్పులు చేసింది. ఈసారి మాత్రం జలాంతర్గామి స్వయంగా క్షిపణిని ప్రయోగించడం విశేషం.

జలాంతర్గామి నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్ష భారత నావికా అణు నిరోధకం సత్తాకు నిదర్శనంగా చెప్పొచ్చు.. ఈ భారత బలిస్టిక్ క్షిపణులు సముద్రం అడుగున ఉన్న జలాంతర్గాముల నుంచి కూడా చైనా, పాకిస్తాన్ లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగించగలవు. దీంతో శత్రువులు గుర్తించేలోపు ఆ దేశాలను స్మాష్ చేసే సత్తా భారత్ సొంతమైనట్టు తెలుస్తోంది.

బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అనంతరం ఆయుధ వ్యవస్థకార్యాచరణ, సాంకేతిక పరిమితులు ధృవీకరించబడ్డాయని అని రక్షణ మంత్రిత్వశాఖ నేటి టెస్ట్ ఫైరింగ్ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. జలాంతర్గామి నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి పరిధిని పరీక్షించారు. ఎక్కువ ఖచ్చితత్వంతో గురిచూసి కొట్టిందని భారత రక్షణ శాఖ సగర్వంగ ాప్రకటించింది. బంగాళాఖాతంలోని లక్ష్య ప్రాంతాన్ని చేధించిందన్నారు.

ఐఎన్ఎస్ హరిహంత్ ద్వారా విజయవంతమైన ఈ పరీక్షతో భారత్ అగ్రదేశాల సరసన చేరింది. భారత శక్తి సామర్థ్యాలను మరింతగా పెంచిందని రక్షణ శాఖ పేర్కొంది. భారత్ మూడు స్వదేశీ నిర్మిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములను నిర్వహిస్తోంది. రెండు జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణులను అభివృద్ధి చేసింది. రెండోది 3500 కి.మీల పరిధిని కలిగి ఉంది. ఇది చైనాకు వ్యతిరేకంగా అను నిరోధకంగా పనిచేస్తుందని తేలింది.

ఈ పరీక్ష విజయవంతంతో భారత్ ప్రపంచంలోనే 6వ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ప్రయోగం చేయగల దేశంగా నిలిచింది. ఇంతకుముందు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా లు మాత్రమే ఈ సామర్థ్యం కలిగి ఉన్నాయి. అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కలిగి ఉన్న ప్రపంచంలోని 6వ దేశంగా భారత్ అవతరించినట్టైంది. ఐఎన్ఎస్ అరిహంత్ భారత మొదటి స్వదేశీ అణు జలాంతర్గామిగా నిలిచింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.