Begin typing your search above and press return to search.
3 వేల మంది కరోనా బాధితులు మిస్సింగ్
By: Tupaki Desk | 29 April 2021 1:30 AM GMTకరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కర్ణాటకలో తీవ్రత పెరగడంతో లాక్ డౌన్ కూడా విధించారు. భారీ ఆంక్షలు విధించారు. అయితే బెంగళూరులో 3వేల మంది కోవిడ్ రోజులు మిస్ అవ్వడం కలకలం రేపుతోంది. వారి జాడ తెలియడం లేదని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా నిర్ధారణ అయిన తర్వాత ఎక్కువమంది వారి మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.వారి వల్లే రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి మరింత పెరుగుతుందని కర్ణాటక మంత్రి అశోక వెల్లడించారు. వీరిని ట్రేసింగ్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
కరోనా నిర్ధారణ అయిన వారు ఇళ్లలోనూ లేరని.. ఎక్కడికి వెళ్లారో తెలియదని.. వారి ఆచూకీ కోసం వెతుకుతున్నామని కర్ణాటక మంత్రి తెలిపారు. వైరస్ సోకిన వారికి ఉచితంగా మందులు ఇస్తున్నామని.. 90శాతం మంది ఇంట్లోనే కోలుకుంటున్నారని తెలిపారు.
కరోనా సోకిన చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషమించి చివరి క్షణంలో ఆస్పత్రులకు వస్తున్నారని.. దయచేసి ఫోన్లు ఆన్ చేసి చికిత్స మొదటి నుంచి తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం కర్ణాటకలో ప్రతిరోజు 30వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం బెంగళూరులోనే 17వేల కేసులు నమోదయ్యాయి.