Begin typing your search above and press return to search.

మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ కుప్పంలో ఫిర్యాదు !

By:  Tupaki Desk   |   25 April 2020 10:10 AM GMT
మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అంటూ కుప్పంలో ఫిర్యాదు !
X
ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ..రాజకీయాలలో తానొక్కడినే అపర చాణిక్యుడిని అని ఫీల్ అవుతుంటారు. అలాగే బాబు గారి మాటలకి పచ్చ మీడియా కూడా బ్యాండ్ వాయిస్తుండటంతో అబ్బా నా మాటకి ఎదురేలేదు ..నాకన్నా బలవంతుడు లేడు అనే భ్రమలో జీవిస్తున్నారు టీడీపీ అధినేత. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు చూసిన తర్వాత కూడా టీడీపీ నేతలు , పచ్చ మీడియాలో మార్పు రాకపోవడం ఆశ్చర్యకరం. ఇక ఈ విషయం పక్కన పెడితే ..ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పంజా విసురుతుంది. ఇటువంటి సమయంలో ప్రధాన ప్రతిక్షనేత హోదాలో ఉన్న బాబు గారు రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ .. పనికి రాని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అవే కరోనా కు గొప్ప ఔషదాలు అని పచ్చ మీడియా వాటిని తెగ ప్రచారం చేస్తుంది. అయన రాస్తున్న లేఖలు , ఉచిత సలహాలు పచ్చ మీడియా కి తప్ప ..పెద్దగా ఎవరికీ ఉపయోగపడవు.

ఇకపోతే , తాజాగా త‌మ ఎమ్మెల్యే క‌న‌ప‌డ‌టం లేదంటూ కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో ఫిర్యాదు నమోదు అయ్యింది. క‌రోనా లాక్ డౌన్ ప్రారంభం కాక ముందు కూడా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి ఫిర్యాదు ఒక‌టి న‌మోద‌య్యింది. ఎన్నిక‌లు అయిపోయాకా నెల‌లు గ‌డుస్తున్నా త‌మ ఎమ్మెల్యే క‌న‌ప‌డ‌టం లేద‌ని,కుప్పానికి పూర్తిగా మొహం చాటేశార‌ని, త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అప్ప‌ట్లోనే ఒక కంప్లైంట్ న‌మోదు అయ్యింది. బాబు గారి వ్యవహార శైలిని గుర్తించిన కుప్పం ప్రజలు .. గ‌త ఎన్నిక‌ల్లోనే కుప్పం ప్ర‌జ‌లు చాలా వ‌ర‌కూ మెజారిటీని త‌గ్గించేశారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఆయ‌న పోటీ చేసిన ఎన్నిక‌ల్లోనే ఆయ‌న మెజారిటీ భారీగా డ్రాప్ అయ్యింది. కుప్పంలో వ‌చ్చే మెజారిటీతో కాపాడుకుంటూ వ‌స్తున్న చిత్తూరు ఎంపీ సీటు కూడా పోయింది. అలాగే , చంద్ర‌బాబు అమరావ‌తి ఏరియాలోని 33 గ్రామాల‌కూ మాత్ర‌మే ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండ‌టం, త‌న ప్రేమాప్యాయ‌త‌ల‌న్నీ ఆ గ్రామాల మీదే చూపుతూ ఉండ‌టం... కుప్పం ప్రజలు బాబు పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేడు అని ..కాసింత వెతికిపెట్టండి అయ్యా అంటూ ఆయ‌న మీద కంప్లైంట్ ఇచ్చారు.

ఇక క‌రోనాతో రాష్ట్రంలోని ప్రజలు అష్టక‌ష్టాల పడుతున్నారు. దీనితో చాలా మంది ఎమ్మెల్యేలు సొంత నియోజ‌క‌వ‌ర్గాల‌కు అందుబాటులో ఉంటున్నారు. కొంత‌మంది సొంత ఖ‌ర్చులు కూడా పెట్టుకుంటూ స‌హ‌యం చేస్తూ ఉన్నారు. కొన్నిచోట్ల తెలుగుదేశం వాళ్లు కూడా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి స‌ర‌కులూ పంచుతున్నారు. అయితే, కుప్పంలో ఎలాంటి అలికిడి లేదు. కుప్పం సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ లో మ‌కాం పెట్టారు. అక్క‌డ ఆయ‌న భ్ర‌మ‌ల ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ ఎమ్మెల్యే చంద్ర‌బాబు నాయుడు క‌నిపించ‌డం లేద‌ని.. కుప్పంలో మ‌రో ఫిర్యాదు దాఖ‌లైంది.