Begin typing your search above and press return to search.

ఫస్ట్ నైట్ రోజున ఎక్కువ మంది చేసే తప్పులు అవేనట..?

By:  Tupaki Desk   |   31 Dec 2022 9:30 AM GMT
ఫస్ట్ నైట్ రోజున ఎక్కువ మంది చేసే తప్పులు అవేనట..?
X
శృంగారం.. ఓ మధుర జ్ఞాపకం. ఇందులో ఎంత నీట్ గా పాల్గొంటే అంత తృప్తిగా ఉంటుంది. ఈ విషయంలో మన సంతోషాని కన్నా భాగస్వామిని తృప్తి పరిస్తే మన ఆనందం కూడా రెట్టింపవుతుంది. చాలా మంది పురుషులు పెళ్లైన కొత్తలో ఎగ్జైట్మెంట్ గా ఫీలవుతారు. దీంతో భాగస్వామిని నగ్నంగా చూసేసరికి ఆగలేరు. ఈ పరిస్థితి వచ్చే సరికి ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి జంతువులా కూడా ప్రవర్తిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి అధిక సంతోషాన్ని ఇవ్వొచ్చు. కానీ ఎదుటివారిని తీవ్రంగా బాధిస్తుంది.

అయితే కొందరు త్వరగా తేరుకొని తమ తప్పును సరిదిద్దుకుంటారు. మరికొందరు ఇవి పట్టించుకోరు. అలాంటి వ్యక్తులపై భాగస్వామికి అసహనం కలిగిస్తుంది. ఆ తరువాత దూరం కావడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో పురుషులు శృంగారంలో పాల్గొనే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. వాటిని పాటించడం వల్ల ఎదుటి వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుందన్ని నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ విషయాలు తెలుసుకునేందకు కొందరు ఫోర్న్ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటారు. పెళ్లి కాకముందు వీటిని చూడడం వల్ల పెళ్లయిన తరువాత కూడా అలాగే జీవితం ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా వీడియోల్లో ఉన్న విధంగా సెక్స్ చేయమని తమ భాగస్వామిని ఇబ్బంది పెడతారు. అయితే అందరికీ ఇది నచ్చకపోవచ్చు. ఈ విషయంలో ఒత్తిడి తీసుకొస్తే ఎదుటివారి మనసును కష్టపెడితే మీ మీద అసహనం కలిగే ప్రమాదం ఉంది.

చాలా మంది శృంగారంలో పాల్గొనే వారు నీట్ గా ఉండరు. పొద్దంతా పనుల్లోకి వెళ్లి ఇంట్లోకి రాగానే అదే పనిమీద పడుతారు. మరికొందరు ప్రత్యేక ప్రదేశాల్లో నీట్ గా ఉంచుకోరు. బద్ధకం బాగా ఉండి వాటిని పట్టించుకోరు. ఈ విషయం ఎదుటివారు పసిగడితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అందువల్ల పడకగదిలోకి వెళ్లే ముందు నీట్ గా ఉండాలి. శుభ్రంగా ఉండడం వల్ల ఎదుటి వారికి మంచి భావన ఏర్పడుతుంది. వీలైతే సుగంధ ద్రవ్యాలు చల్లుకోవడంతో మంచి స్మెల్ తో మీకు మరింత దగ్గరవుతారు.

కొందరు మద్యం సేవించి శృంగారంలో పాల్గొంటారు. అయితే తాగిన మైకంలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో ఆడవాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. కానీ మరుసటి రోజు మాత్రం దానిని గుర్తుపెట్టుకోరు. అయితే దానిని అనుభవించిన వారు మాత్రం నరకగా ఫీలవుతారు. చాలా వరకు మద్యం తాగకుండానే శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎదుటివారు మీతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతారు.

శృంగారంలో ఫోర్ ప్లే అన్న విషయం దాదాపు చాలా మందికి అవగాహన ఉండదు. తమకు ఎమోషన్ వచ్చినప్పుడు 5 నిమిషాల్లో పనిగానించాలని అనుకుంటారు. కానీ ఆడవాళ్లకు ఎక్కువగా ఫోర్ ఫ్లే చేసే వ్యక్తులంటే చాలా ఇష్టం. ఫోర్ ప్లే ద్వారా వారి శరీరంలోని ముఖ్యమైన అవయవాలు టచ్ చేస్తే వారిలో ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. దీంతో మీతో శృంగారం చేయడానికి బాగా సహకరిస్తారు.

ఇలా కొన్ని విషయాల్లో క్రమ పద్ధతులు పాటిస్తే ఆనందమైన శృంగారాన్ని పొందవచ్చు. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారానే ఇలాంటి విషయాలపై తొందరపడకుండా.. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే వైద్యులను సంప్రదించాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.