Begin typing your search above and press return to search.

మిథాలి యే నాకు స్ఫూర్తి..

By:  Tupaki Desk   |   21 May 2021 11:30 AM GMT
మిథాలి యే నాకు స్ఫూర్తి..
X
హైదరాబాద్​కు చెందిన మహిళా క్రికెటర్​ అరుంధతి రెడ్డి .. ఇటీవల ఇంగ్లండ్​ టూ ర్​ కు ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. ఇదివరకు టీ20 ఫార్మాట్​ లో మాత్రమే ఆడిన అరుంధతి తొలిసారిగా వన్డే ఫార్మాట్​ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఇంగ్లాండ్​ టూర్​ లో ఆడటం నా కల. అది ఇప్పుడు నేరవేరబోతుంది. నాకు టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాల్ రాజ్​ ఆదర్శం. ఆమె క్రికెట్​ చూస్తూనే నేను పెరిగాను. ఆమె దగ్గరే అనేక మెలకువలను నేర్చుకున్నాను.

నేను ఇవాళ ఇంగ్లండ్​ టూర్​ కు ఎంపికయ్యానంటూ అందుకు కారణం మిథాలి అక్కే’ అని పేర్కొన్నారు.’నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో మిథాలి అక్క జట్టులో ఉంది. ఆమె సహకారాన్ని నేను మరవలేను. రైల్వేస్​ తరఫున కూడా ఆమె కెప్టెన్సీలో ఆడా. తోటి క్రీడాకారిణిగా, హైదరాబాద్​ ప్లేయర్​ గా మిథాలి అక్క నాకు ఎంతో సహకారం అందించింది. పలు సందర్భాల్లో నాకు ధైర్యం ఇచ్చింది’ అని అన్నారు.

అది తప్పే..!

ఇటీవల లక్నోలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో నేను దిద్దుకోలేను తప్పు చేశాను. నా తప్పు వల్లే ఆ మ్యాచ్​ ఓడిపోయాం. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి ‘నోబాల్‌ 'గా వేశాను. నేను నోబాల్​ వేయకుంటే మ్యాచ్​ గెలిచేది. ఇంకోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను.

అంతర్జాతీయ క్రికెట్​ లోకి అరంగేట్రం చేశాక.. నా బౌలింగ్ లో ఎన్నో మార్పులు చేసుకున్నాను.నేను ప్రతిరోజు ఏదో ఒక పాఠం నేర్చుకుంటాను. నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మెరుగ్గా రాణిస్తా’ అంటూ అరుంధతి రెడ్డి తన మనసులోని మాటను పంచుకున్నారు.