Begin typing your search above and press return to search.
మిథాలీకి అప్పుడు షెవర్లే..ఇప్పుడు బీఎండబ్ల్యూ
By: Tupaki Desk | 1 Aug 2017 11:45 AM GMTభారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పంట పండింది. అమ్మాయిలు ప్రపంచకప్ గెలవకపోయినా.. స్ఫూర్తిమంతమైన నాయకత్వంతో జట్టును ఫైనల్ వరకు నడిపించిన మిథాలీ మీద కానుకల వర్షం కురుస్తోంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం మిథాలీకి కోటి రూపాయల నజరానాతో పాటు.. ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ 600 గజాల స్థలం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీసీసీఐ సైతం మిథాలీతో పాటు జట్టు సభ్యులందరికీ తలో రూ.50 లక్షల చొప్పున బహుమతి అందజేసింది. ఇది కాక హైదరాబాదీ బిజినెస్ మ్యాన్ చాముండీశ్వరీనాథ్ ఆమెకు రూ.40 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు బహుమతిగా అందజేశాడు.
మహిళల జట్టు ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన వెంటనే మిథాలీకి బీఎండబ్ల్యూ కారు ఇవ్వనున్నట్లు చాముండి ప్రకటించాడు. అన్నట్లుగానే మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మిథాలీకి కారు బహుకరించాడు చాముండి. ఆయన ఇంతకుముందే ఒకసారి మిథాలీకి షెవర్లే కారును బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు మరింత ఖరీదైన కారు ఇచ్చాడు. చాముండి గత ఏడాది రియో ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సింధు.. సాక్షి మాలిక్.. దీపా కర్మాకర్ లకు కూడా బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిథాలీ ప్రపంచకప్ లో భారత జట్టును ముందుండి నడిపించిందని.. బ్యాటింగ్ లో చక్కగా రాణించిందని.. ఆమె హైదరాబాద్ కు గర్వకారణమని చాముండి అన్నాడు.