Begin typing your search above and press return to search.
జగన్ ఎంపీకి బెయిల్ ఇవ్వని కోర్టు
By: Tupaki Desk | 21 Jan 2016 4:34 AM GMTజగన్ బ్యాచ్ కి షాక్ తగిలింది. ప్రోటోకాల్ సరిగా పాటించలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రేణిగుంట ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో జగన్ ఎంపీని ఇటీవల అరెస్ట్ చేశారు. దీనిపై ఏపీ ప్రధాన ప్రతినిపక్షం తీవ్రంగా విమర్శలు చేసింది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎంపీ బెయిల్ అంశం తిరుపతి కోర్టు ముందుకు వచ్చింది. అయితే.. మిథున్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. కోర్టులో బెయిల్ వస్తుందని కోటి ఆశలతో ఉన్నజగన్ పార్టీకి ఈ పరిణామం షాకింగ్ గా మారింది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) తో పాటు మరో 13 మందిపై కేసు నమోదు అయ్యింది. బెయిల్ రాకపోవటం జగన్ బ్యాచ్ కి ఇబ్బందికి కలిగించే అంశంగా చెప్పొచ్చు.