Begin typing your search above and press return to search.
కీలక స్కాంలో బాబు..తెరమీదకు రాకుండా ఎంపీల రాజీనామాలు
By: Tupaki Desk | 5 Jun 2018 11:41 AM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఉద్దశపూర్వక విమర్శలకు చంద్రబాబు పెట్టింది పేరని....తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆయన కొత్త అజెండాను తెరమీదకు తెస్తారని మిథున్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ ఆర్ సీపీ ఎంపీల రాజీనామాలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరును ఆయన ఖండించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి ఎయిర్ ఏషియా స్కాంను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కొత్తగా రాజీనామాల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని దీని వెనుక టీడీపీలో నెలకొన్న గుబులే కారణమని తెలిపారు.
టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు మంత్రిగా పనిచేసిన శాఖకు సంబంధించి ఎయిర్ ఏషియా సంస్థలో స్కాంపై సీబీఐ ఎంక్వైరీ జరుగుతోందని మిథున్ రెడ్డి తెలిపారు. చంద్రబాబును వాడుకుంటే మన పనులు అవుతాయని సంస్థ సీఈఓ మాట్లాడిన వీడియో టేపులు నేషనల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయన్నారు. ఈ స్కాం విషయంలో సీబీఐ ఎంక్వైరీ ప్రజలకు తెలియకుండా ఉండేందుకు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాజీనామాల అంశం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసిన అంశాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారని ఇదంతా డైవర్షన్ గేమ్‌లో భాగమని ఆరోపించారు. 25 మంది రాజీనామాలు చేయిస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని, రాజకీయాలు పక్కనబెడదాం.. కలిసి రాజీనామాలు చేసి కేంద్రంపై పోరాడుదామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ గతంలో అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం మీరు ముందు నడిచినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పలుమార్లు చెప్పామన్నారు. అయినా వాటికి సమాధానం చెప్పకుండా రాజీనామాల నుంచి పారిపోయిన చంద్రబాబు ఇవాళ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తున్న టీడీపీ ఎంపీలు ఐదేళ్ల పదవికాలంలో నాలుగేళ్లు కేంద్రాన్ని పొగడడమే సరిపోయిందని మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆఖరి బడ్జెట్ బాగాలేదని యూటర్న్ తీసుకొని.. హోదా కావాలని అన్యాయం జరుగుతుందని మాట్లాడడం న్యాయమా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సీపీ పోరాటంలో కలిసి రావాలని చెప్పినా నోరు తెరిచిన పాపానపోలేదన్నారు. లోకేష్ అలియాస్ పప్పు రెండు ట్వీట్ లు చేశారని - వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు డ్రామాలు చేస్తున్నారు.. అవార్డు ఇవ్వాలని ట్వీట్ చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని ముందు వరుసలో పెడతానని అవినీతిలో నంబర్ వన్ లో పెట్టారు. ఏ సంస్థ సర్వే చేసినా అవినీతిలో నంబర్ వన్ ర్యాంకే ఇస్తున్నారన్నారు. నీతి - నిజాయితీ గురించి మాట్లాడే ముందు లోకేష్ ఒకసారి తనవైపు కూడా చూసుకోవాలన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ విధంగా కొన్నారు.. రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మిథున్‌రెడ్డి అన్నారు. హోదా సాధన కోసం వైఎస్ జగన్ ఆదేశాలతో రాజీనామా సైతం చేశామన్నారు. హోదా సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ప్రతిపక్ష ఎంపీలుగా రాజీనామాలు చేశాం.. ఉప ఎన్నికలకు వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో చూపిస్తామన్నారు.