Begin typing your search above and press return to search.
జగన్ రైట్ హ్యాండ్ కు లోక్ సభలో మరో కీలక పదవి
By: Tupaki Desk | 2 July 2019 5:20 AM GMTఆయన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు రైట్ హ్యాండ్.. టీడీపీకి కంచుకోట ఉన్న జిల్లాలో వైసీపీని తిరుగులేని శక్తిగా తయారుచేసిన నాయకుడు. తాజాగా, ఆయనకు మరో కీలక పదవి దక్కింది. ఇంతకీ ఆయన ఎవరని ఆలోచిస్తున్నారా..? ఆ కీలక నేత మరెవరో కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి. రెండు సార్లు ఎంపీగా విజయ దుందుభి మోగించిన విథున్ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ కూడా అదేస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో, లోక్ సభలో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. ఇప్పటికే ఆయనకు పార్టీ లోక్ సభ పక్ష నేతగా అవకాశం కల్పించారు.
మిథున్ రెడ్డి తాజాగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నిన్ననే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ప్యానల్ స్పీకర్ అంటే ఏమిటి.. విధులు ఎలా ఉంటాయంటే.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్ సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్నమాట. ఈ అరుదైన అవకాశం, గౌరవం విథున్ రెడ్డికి దక్కడంపట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించిన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలకు ముందు మిథున్ రెడ్డి టీడీపీ కంచుకోట అనంతపురం జిల్లాకు ఇన్ చార్జ్ గా ఉన్నారు. మూడేళ్ల పాటు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు పాత్ర పోషించారు. ఈ జిల్లాలో వైసీపీని తిరుగలేని శక్తిగా తీర్చిదిద్దారు. ఈ ఎన్నికల్లో 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక రాజంపేటలో లోక్ సభ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై ఆయన తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డీకే. సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.