Begin typing your search above and press return to search.
మీ ఆస్తులకు డబుల్ ఇస్తాం..ఇచ్చేస్తావా లోకేష్
By: Tupaki Desk | 8 Dec 2017 12:09 PM GMTనారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల ప్రకటన అంతా పెద్ద బూటకం, నాటకమని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. తమ ఆస్తుల విలువ ఇంతే అంటూ అసత్య వివరాలు ప్రకటించిన లోకేష్ అంతకు రెట్టింపు మొత్తాన్ని తాము ఇస్తే....స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తమ కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్ ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఆస్తులు వెల్లడించాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి - పార్టీ నేత మల్లాది విష్ణు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సవాల్ విసిరారు. లోకేష్ ప్రకటనలో ఉన్నదే నిజమైతే...ఆ ప్రకటనలో ఉన్న ఆస్తులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. అవసరమైతే చందాలు వేసుకొని మరీ లోకేష్ ఆస్తులు కొంటామని - వాటిని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. ఈ సవాల్‌కు టీడీపీ ముందుకు వస్తుందా మిథున్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
మంత్రి నారా లోకేష్ ఆస్తుల ప్రకటన - బూటకం - నాటకమని వైఎస్ ఆర్ సీపీ నాయకులు - మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. లోకేష్ చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆస్తుల ప్రకటన బూటకం - నాటకమని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. లోకేష్ పూర్తిగా అబద్ధాలు - అసత్యాలు మాట్లాడారని - అందుకే డిసెంబర్ 8ని అబద్ధాల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను రూ.720 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారని మల్లాది విష్ణు అన్నారు. ఆ డబ్బంతా మీది కాదా? అది మీ పెట్టుబడి డబ్బులు కాదా అని లోకేష్‌ను నిలదీశారు. మీ ఆస్తుల ప్రకటనలో ఈ డబ్బును ఎందుకు చూపించలేదన్నారు. లోకేష్ ఆస్తుల ప్రకటన అవాస్తవమని, అది బూటకం - నాటమని విమర్శించారు. లోకేష్ పూర్తిగా అబద్ధాలు - అసత్యాలు మాట్లాడారని, అందుకే డిసెంబర్ 8ని అబద్ధాల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని మీడియాకు దూరంగా పెట్టారని, తమకు ఏమీ లేనట్లుగా చంద్రబాబు నటిస్తూ, కొడుకుతో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత లోకేష్‌కు లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని మల్లాది విష్ణు నిలదీశారు. పవన్ కళ్యాణ్ అవసరానికి మించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఫాతిమా కాలేజీ వ్యవహారంపై మూడు నెలలుగా పట్టించుకోకుండా ఈ రోజు పవన్ మాట్లాడటం బాధాకరమన్నారు. ఆయన ప్రజలు మూడు రోజులు కాల్షిట్లు ఇచ్చారని, అందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పవన్ రూపాయికి ఒకపక్కనే చూస్తున్నారు తప్ప, రెండో పక్క ఎందుకు చూడటం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.