Begin typing your search above and press return to search.

స్టేష‌న్ మెట్లెక్క‌కున్న వైసీపీ అగ్ర‌నేత‌

By:  Tupaki Desk   |   13 Jan 2016 6:47 AM GMT
స్టేష‌న్ మెట్లెక్క‌కున్న వైసీపీ అగ్ర‌నేత‌
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాలం క‌లిసిరావ‌డం లేదు. ఆ పార్టీ నేత‌లు వ‌రుస‌బెట్టి వివాదాల్లో చిక్కుకోవ‌డం, ఒక‌రి వెంట మ‌రొక‌రు పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి రావ‌డం ఇందుకు కార‌ణం. ఇపుడు జ‌గ‌న్ స‌న్నిహితుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ మిథున్‌ రెడ్డి త‌న‌ నిర్వాకం వ‌ల్ల పోలీసు స్టేష‌న్‌ లో స‌మాధానం ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

నవంబర్ 26న రేణిగుంట విమానాశ్రయంలో ఎంపీ మిథున్ రెడ్డి - ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వారి అనుచరులు ఎయిర్‌ పోర్ట్ మేనేజర్ రాజశేఖర్‌ తో గొడవకు దిగారు. ఈ విష‌య‌మై వివాదం చెల‌రేగ‌గా త‌మ‌కేమీ సంబంధం లేద‌ని ఆ ఇద్ద‌రు నేత‌లు వివ‌రణ ఇచ్చారు. పైగా ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెట్టార‌ని ఆరోపించారు. అయితే సీసీటీవీ పుటేజీ విడుద‌ల కావ‌డం, అందులో ఎంపీ దాడిచేసింది నిజ‌మ‌ని తేల‌డంతో పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు.

ఈ క్ర‌మంలో మిథున్‌ రెడ్డిని కోర్టులో హాజ‌రుప‌ర్చేందుకు వారంట్ సిద్ధం చేశారు. అయితే ముందస్తు బెయిల్‌ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ బెయిల్‌ ను హైకోర్టు నిరాకరించింది దీంతో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నిరాశ ఎదురైంది, ఒకటి రెండ్రోజుల్లో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రోజా స‌స్పెన్ష‌న్‌ తో త‌ల‌బొప్పి క‌ట్టిన జ‌గ‌న్‌ కు మిథున్‌ రెడ్డి ఎపిసోడ్ మ‌రింత త‌ల‌నొప్పిగా మార‌నుంది.