Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే సరిపోతుందట !

By:  Tupaki Desk   |   8 May 2020 12:30 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ : స్కూళ్లలో 50 శాతం ఫీజు  కడితే సరిపోతుందట !
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‌ డౌన్‌ లోకి వెళ్లిపోయాయి. అలాగే మన దేశంలోనూ కరోనా తీవ్రంగా వ్యాపిస్తూండటంతో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ మూసివేశారు. మే 17 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా.. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి.

అయితే, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలతో గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల లో పలు షాపులు తెరవడానికి సడలింపులు ఇచ్చింది. అయితే , లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్న ప్రజలు పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దష్ట్యా మిజోరంలో ప్రైవేట్ స్కూళ్లు కేవలం 50 శాతం మాత్రమే ఫీజులను వసూలు చేయాలని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. విద్యార్థుల నుంచి కేవలం 50 శాతం ఫీజు చెల్లించాలని ప్రైవేటు స్కూల్స్‌ని ఆదేశించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

తాజాగా మిజోరాంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై విద్యాశాఖ అధికారులు సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో ఫీజుల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. లాక్‌ డౌన్ సమయంలో విద్యార్థులు స్కూల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉందని, ఫీజుల విషయంలో ఇప్పటికే విద్యార్థి విభాగాలు అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో మొత్తం ఫీజును వసూలు చేసిన స్కూళ్లన్నీ.. మే నెలలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని స్కూల్ యాజమాన్యాలను ఆదేశించినట్టు మిజోరాం ప్రభుత్వం తెలిపింది.