Begin typing your search above and press return to search.
నన్ను చేర్చుకోకపోతే ప్రతిపక్ష పార్టీకి కష్టాలే
By: Tupaki Desk | 26 Aug 2018 6:20 AM GMTహాట్ హాట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో ఇటీవల ఒకదాని వెంట మరో రారజకీయ కలకలం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అమ్మగా పేరొందిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం అనంతరం కొద్దికాలానికి డీఎంకే చీఫ్ కరుణానిధి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో కూడా వారసత్వ పోరు పెద్ద ఎత్తున్నే జరుగుతోంది. తాజాగా పెద్ద కుమారుడు, -డీఎంకే బహిష్కృత నేత అళగిరి మరోసారి డీఎంకేకు హెచ్చరికలు పంపారు. తాను సెప్టెంబర్ 5న చేపట్టనున్న చెన్నై ర్యాలీ తర్వాత పార్టీకి ముప్పు తప్పదన్నారు. ఓ వైపు తన పట్టనును కొనసాగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ ప్రకటన కలకలంగా మారింది.
పార్టీకి నిబద్ధులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని కొద్ది రోజుల కిందట ప్రకటించిన అళగిరి.. పార్టీలోకి తన పునఃప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో అళగిరి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తన వర్గం బలాన్ని నిరూపించేందుకు అళగిరి చెన్నైలో భారీ ర్యాలీకి ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం మధురైలో మీడియాతో మాట్లాడిన అళగిరి... ``సెప్టెంబర్ 5 వరకు వేచి ఉండండి. తలైవర్ (కరుణానిధి) స్మృతిలో భాగంగా చెన్నైలో మేం నిశ్శబ్ద ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత పార్టీ (డీఎంకే) నాయకులు నన్ను ఎలా అంగీకరిస్తారో.. నేను అక్కడ ఉండాలని ఎలా కోరుకుంటారో మీరే చూస్తారు. నా ర్యాలీ వల్ల పార్టీ ముప్పును ఎదుర్కోక తప్పదు. ఎన్నికల్లో నా పనితనాన్ని, సంస్థాగత నైపుణ్యాలను ప్రత్యర్థులు సైతం ప్రశంసిస్తారు`` అని అళగిరి అన్నారు. ``ఈ ర్యాలీతోనైనా డీఎంకేలోని ఒకవర్గం నాయకులు నన్ను అర్థంచేసుకుంటారు. తలైవర్ బతికున్నప్పుడు నేను ఎలాంటి పదవిని కోరుకోలేదు. ఇప్పుడు మాత్రం నేను పదవులు కోరుకుంటానని ఎలా అనుకుంటారు? డీఎంకే అధ్యక్షుడిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి స్టాలిన్ తొందరపడుతున్నాడు. ఒకవేళ నన్ను పార్టీలో చేర్చుకోకపోతే గత లోక్ సభ - అసెంబ్లీ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో అదే గతి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పడుతుంది`` అని హెచ్చరించారు. ఈ ప్రకటన ర్యాలీతో అళగిరి ఏం చేయనున్నారనే ఆసక్తినెలకొంది.