Begin typing your search above and press return to search.

అమ్మ మ‌ర‌ణంపై విప‌క్షం కూడా డౌట్ ప‌డిందే

By:  Tupaki Desk   |   30 Dec 2016 1:50 PM GMT
అమ్మ మ‌ర‌ణంపై విప‌క్షం కూడా డౌట్ ప‌డిందే
X
ఏఐఏడీఎంకే అధినేత్రి - తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విష‌యంలో ఊహించ‌ని ట్విస్టులు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే మద్రాసు హైకోర్టు జడ్జీ వైద్యనాథన్ జయలలిత మృతిపై నిన్న అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జయలలిత మృతదేహాన్ని వెలికితీసి ఎందుకు పోస్టుమార్టం నిర్వహించరాదో తెలుపాలని అడ్వకేట్ జనరల్‌ ను ప్రశ్నించారు. తాజాగా ఈ ఎపిసోడ్ లోకి ప్ర‌తిప‌క్ష డీఎంకే ఎంటరైంది. జ‌య‌ల‌లిత మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డీఎంకే పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐఏడీఎంకే మాజీ అధినేతకు జరిగిన వైద్య వివరాలు - పూర్తి మెడికల్ బులిటెన్‌ లు - వీడియో ఫుటేజీ - ఆస్పత్రిలో వైద్యం పొందుతుండగా ఆమె ఫోటోలు తదితరాలన్నింటినీ విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అందిన వైద్య స‌హాయం గురించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా తాము ఇప్ప‌టికే కోరగా ఇంతవరకు స్పందించలేదని స్టాలిన్ త‌ప్పుప‌ట్టారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సైతం ఆమెకు చికిత్స అందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం - సీఎం పన్నీర్ సెల్వంపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వమే వైద్య చికిత్సపై సమాచారం అందించి ఉంటే విషయం కోర్టు పరిధి వరకు పోదని అన్నారు. డీఎంకే అధినేత అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఫోటోలను తామే విడుదల చేశామని స్టాలిన్‌ తెలిపారు. కానీ జయలలిత ఫోటోలు వాళ్లు ఎప్పుడూ చూపించలేదన్నారు. జయలలితకు ఎటువంటి చికిత్స అందించారు. ఆమె మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడం ప్రజల హక్కు అని ఆయన పేర్కొన్నారు.

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ‌శిక‌ళ‌ బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌రుస‌టి రోజే అమ్మ మ‌ర‌ణంపై స్టాలిన్ సందేహాలు వ్య‌క్తం చేయ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లు సంయ‌మ‌నం పాటించిన డీఎంకే ఇక‌నుంచి దూకుడుగా వెళుతుంద‌నేందుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/