Begin typing your search above and press return to search.

సంచ‌లనంగా మారిన స్టాలిన్ సందేహాలు!

By:  Tupaki Desk   |   30 Sep 2017 5:04 AM GMT
సంచ‌లనంగా మారిన స్టాలిన్ సందేహాలు!
X
ముఖ్య‌మంత్రి కాన్వాయ్‌ను ఎప్పుడైనా చూశారా? రాజ‌ధాని న‌గ‌రంలో కాకుండా మ‌రే ప్రాంతంలో ప‌ర్య‌టిస్తున్నా భారీ కాన్వాయ్ చివ‌ర్లో అంబులెన్స్ ఉండ‌టం క‌నిపిస్తుంది. ఇక‌.. జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉండే ముఖ్య‌మంత్రుల భ‌ద్ర‌త మ‌రింత క‌ట్టుదిట్టంగా ఉంటుంది. మ‌రి.. ఇంత ఉన్నా.. అమ్మ విష‌యంలో మాత్రం ఇలాంటి జాగ్ర‌త్త‌లేవీ తీసుకోలేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అమ్మ మ‌ర‌ణంపై అనేక సందేహాలు స‌గ‌టు జీవి నుంచి సీఎం వ‌ర‌కూ ఉన్నాయి.

అమ్మ మ‌ర‌ణం వెనుక ఏదో గూఢ‌పుఠాణి జ‌రిగింద‌న్న వాద‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. ఇలాంటి వాద‌న‌ను మొద‌ట్లో కొట్టిపారేసినోళ్లు సైతం ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్న అంశాల్ని చూసి.. సందేహానికి గురి అవుతున్నారు. అమ్మ మ‌ర‌ణం వెనుక ఏదో జ‌రిగి ఉంటుంద‌న్న మాట‌ను మొన్న‌టి వ‌ర‌కూ కొట్టిపారేసినోళ్లు.. ఇప్పుడలా తొంద‌ర‌ప‌డ‌టం లేదు. ఏమో.. ఏదైనా జ‌రిగి ఉండొచ్చేమోన‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఒక త‌మిళ ఛాన‌ల్ బ‌య‌ట‌పెట్టిన ప‌త్రాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న అమ్మ జ‌య‌ల‌లిత‌ను అర్థ‌రాత్రి వేళ‌.. హ‌డావుడిగా చెన్నై అపోలోకు అంబులెన్స్ లో త‌ర‌లించిన వైనంతో పాటు.. పేషెంట్ కేర్ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సీఎంగా ఉన్న జ‌య‌ల‌లిత‌ను అనారోగ్యంతో ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వ అంబులెన్స్ లో కాకుండా ప్రైవేటు అంబులెన్స్ లో ఆసుప‌త్రిలో త‌ర‌లించ‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా త‌మిళ‌నాడు విప‌క్ష నేత స్టాలిన్ ప‌లు సందేహాల్ని వ్య‌క్తం చేశారు. అమ్మ‌ను ఆసుప‌త్రిలో చేర్చిన నాటి నుంచి మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆయ‌న సంధిస్తున్న ప్ర‌శ్న‌లు చూసిన‌ప్పుడు.. ప‌లు డౌట్లు రావ‌టం ఖాయం. జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌తా సిబ్బంది జ‌య ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు ఎక్క‌డ‌కు వెళ్లార‌న్న‌ది మొద‌టి సందేహం కాగా.. 75 రోజుల పాటు వారేం చేశారో? చెప్పాలంటున్నారు. ఆమె ఆరోగ్యంపై కేంద్ర హోంశాఖ‌కు నివేదిక స‌మ‌ర్పించారా? లేదా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. జ‌య ఆరోగ్యం గురించి వారు పూర్తి స‌మాచారం ఇచ్చారా? అన్న సందేహాల్ని వ్య‌క్తం చేశారు.

అమ్మ అనారోగ్యంపై కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. అక్టోబ‌రు మొద‌టి వారం వ‌ర‌కూ చిన్న‌మ్మ శ‌శిక‌ళ సైతం జ‌య‌ను చూడ‌లేద‌ని దిన‌క‌ర‌న్ చెబుతున్న మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆసుప‌త్రిలో ఉన్న అమ్మ అప‌స్మార‌క స్థితి ఉంటే ప‌న్నీర్ సెల్వానికి ముఖ్య‌మంత్రి బాధ్య‌తలు ఎలా అప్ప‌జెప్పారు? అని అడుగుతున్నారు.

అక్టోబ‌రు మొద‌టివారం వ‌ర‌కు అమ్మ‌ను చిన్న‌మ్మ శ‌శిక‌ళ చూడ‌లేదంటూ దిన‌క‌ర‌న్ చెబుతున్న‌ప్పుడు.. మ‌రి.. తిరుప్ప‌రంకుండ్రం ఉప ఎన్నిక‌ల బీఫారం మీద అమ్మ వేలిముద్ర ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం సంత‌కాన్ని అమ్మ చుట్టు ఉన్న వారు ఫోర్జ‌రీ చేశారా? ప‌ద‌వుల పంప‌కం కోస‌మే జ‌య ఆరోగ్యంపై 75 రోజుల పాటు నాట‌కాలు ఆడారా? అన్న సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు స్టాలిన్‌. ఆయ‌న సంధిస్తున్న సందేహాల‌కు అమ్మ వ‌ర్గం నుంచి ఎలాంటి సమాధానాలు రాక‌పోవ‌టం సామాన్యుల్లో మ‌రిన్ని డౌట్లు వ‌స్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.