Begin typing your search above and press return to search.

50 ఏళ్ల త‌ర్వాత మార్పు.. డీఎంకే సార‌థి స్టాలిన్!

By:  Tupaki Desk   |   28 Aug 2018 8:29 AM GMT
50 ఏళ్ల త‌ర్వాత మార్పు.. డీఎంకే సార‌థి స్టాలిన్!
X
దేశంలోని పార్టీల తీరు ఒక‌లా.. త‌మిళ‌నాడు రాజ‌కీయ పార్టీల తీరు మ‌రోలా క‌నిపిస్తుంటుంది. ఏదైనా ఒక పార్టీకి యాభై ఏళ్ల పాటు ఒకే వ్య‌క్తి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించ‌టం సాధ్య‌మా? అంటే నో అనేస్తారు. కానీ.. అది క‌లైంజ‌ర్ క‌రుణ‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. సుదీర్ఘ రాజ‌కీయ జీవితాన్ని గ‌డిపిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్య‌న అనారోగ్యంతో క‌న్నుమూయ‌టం తెలిసిందే.

క‌రుణ అస్త‌మ‌యం త‌ర్వాత డీఎంకేకు కొత్త ర‌థ‌సార‌ధిని ఎన్నుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. క‌రుణ బ‌తికి ఉన్న‌ప్పుడే త‌న రాజ‌కీయ వార‌సుడు ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ ఇచ్చేయ‌టం.. తోక జాడిస్తున్న మ‌రో కొడుకు ఆళ‌గిరిని పార్టీ నుంచి గెంటివేయ‌టం లాంటి ప‌రిణామాల‌తో.. సోద‌రి క‌నమొళి మ‌ద్ద‌తు తోడు కావ‌టంతో డీఎంకే కొత్త సార‌థిగా స్టాలిన్ ఎన్నిక‌య్యారు. ఈ విష‌యాన్ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అన్బ‌ళ‌గ‌న్ వెల్ల‌డించారు.

ఈ రోజు పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో డీఎంకే అధ్య‌క్షుడిగా క‌రుణ కుమారుడు స్టాలిన్ ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో.. డీఎంకే మూడో అధ్య‌క్షుడిగా స్టాలిన్ ఎన్నికైన‌ట్లు అయ్యింది. డీఎంకే ప‌గ్గాల్ని క‌రుణ చేప‌ట్టిన యాభై ఏళ్ల త‌ర్వాత‌.. ఆయ‌న మ‌ర‌ణం అనంత‌రం పార్టీ ప‌గ్గాలు స్టాలిన్ చేతికి వ‌చ్చాయి. స్టాలిన్ ను అధ్య‌క్షుడిగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించిన వెంట‌నే.. పార్టీ శ్రేణులు సంబ‌రాల్లో మునిగిపోయాయి. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద పెద్ద ఎత్తున బాణ‌సంచా కాల్చి సంబ‌రాలు చేసుకున్నారు.

డీఎంకే ర‌థ‌సార‌ధిగా క‌రుణ ఉన్న‌ప్ప‌టికీ.. వాస్త‌వంగా చూస్తే.. గ‌డిచిన కొన్నేళ్లుగా పార్టీని న‌డిపిస్తోన్న‌ది స్టాలినే. పెద్దాయ‌న ఉండ‌టంతో ఆయ‌న పేరుతో పార్టీని స్టాలినే న‌డిపిస్తున్నారు. దీంతో.. ఆయ‌న‌కు పార్టీ మీద పూర్తిస్థాయి ప‌ట్టు ఉంద‌ని చెప్పాలి. పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సోద‌రుడు అళ‌గిరి త‌న వ్యాఖ్య‌ల‌తో కాస్త క‌ల‌క‌లం రేపినా.. స్టాలిన్ మాత్రం పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి స్టాలిన్ త‌ప్ప మ‌రెవ‌రూ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌క‌పోవ‌టంతో ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు.

స్టాలిన్ విష‌యానికి వ‌స్తే.. క‌రుణ మూడో కొడుకుగా చెప్పాలి. 1953 మార్చి 1న మ‌ద్రాసులో జ‌న్మించారు. ఆయ‌న పుట్టిన నాలుగురోజుల‌కే ర‌ష్యా అధ్యక్షుడు స్టాలిన్ మ‌ర‌ణించ‌టం.. వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న కరుణ ఒక స‌భ‌లో భావోద్వేగానికి గురై.. త‌న కొడుక్కి స్టాలిన్ పేరును పెడుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అలా స్టాలిన్ ఆయ‌న పేరైంది. 14 ఏళ్ల వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన స్టాలిన్.. 1973 డీఎంకే జ‌న‌ర‌ల్ క‌మిటీకి ఎన్నిక‌య్యారు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా పోరాడి జైలుకు వెళ్ల‌టంతో ఆయ‌న పేరు వార్త‌ల్లోకి వ‌చ్చింది. త‌మిళ‌నాడు అసెంబ్లీకి స్టాలిన్ నాలుగుసార్లు ఎన్నిక‌య్యారు. డీఎంకే కు అన్నాదురై త‌ర్వాత క‌రుణ పార్టీ ప‌గ్గాలు చేప‌డితే.. మూడో వ్య‌క్తిగా స్టాలిన్ నిలిచారు. తాజాగా డీఎంకేలో కొత్త శ‌కం అధికారికంగా మొద‌లైన‌ట్లుగా చెప్పాలి.