Begin typing your search above and press return to search.
మొన్న జగన్.. ఇప్పుడు స్టాలిన్
By: Tupaki Desk | 2 Nov 2016 7:47 AM GMTకీలక రాజకీయ నేతలు తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడటం కొత్తేం కాదు. కానీ.. స్వల్ప వ్యవధిలో ఇద్దరు ప్రముఖ నేతలు రోడ్డు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవటం కనిపిస్తుంది. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యన కర్నూలు వెళ్లి.. హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళ.. హైదరాబాద్ శివార్ల వద్దకు వచ్చేసరికి ఆయన కారు టైరు పంక్చర్ అయ్యింది. అప్పటికే వేగంగా వెళుతున్న కారు.. ఊహించని రీతిలో ప్రమాదానికి గురి కావటం ఆందోళన కలిగించినా.. ఈ ఘటనలో జగన్ కు ఏమీ కాకపోవటం ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేసింది.
తాజాగా అలాంటిదే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు విపక్ష నేత.. డీఎంకేలో కరుణానిధి తర్వాత ఆయన వారసుడైన స్టాలిన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు.. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. తాజాగా ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు స్టాలిన్ ధర్మపురి వెళుతున్నారు. ఇదిలా ఉండగా.. పల్లికొండ టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న స్టాలిన్ కారును వెనుక నుంచి మరోకారు ఓవర్ టేక్ చేయబోయి.. ఢీ కొట్టింది.
దీంతో.. కారు ముందు భాగంగా ఎక్కువగా ధ్వంసమైంది. కారులో ఉన్న స్టాలిన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఆయన క్షేమంగా ఉన్నారు. భారీ ప్రమాదం తృటిలో తప్పిన ఘటన డీఎంకే వర్గాల్లో ఆందోళనకు గురయ్యేలా చేసింది. అయితే.. ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకునేలా చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/