Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన స్టాలిన్‌

By:  Tupaki Desk   |   30 Aug 2017 10:55 AM GMT
గ‌వ‌ర్న‌ర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన స్టాలిన్‌
X
త‌మిళ‌నాడు అధికార‌ప‌క్ష‌మైన అన్నాడీఎంకే లో చోటు చేసుకున్న అధిప‌త్య‌పోరు.. అంత‌ర్గ‌త సంక్షోభం మ‌రో మ‌లుపు తిరిగాయి. ప‌ళ‌ని.. ప‌న్నీర్ లు ఏక‌మై.. చిన్న‌మ్మ అండ్ కోల‌కు చుక్క‌లు చూపిస్తూ.. వారిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు గెంటేసే ప్రోగ్రామ్‌ ను ఇటీవ‌ల షురూ చేయ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌ళ‌ని.. ప‌న్నీరుల‌కు షాకిస్తూ దిన‌క‌ర‌న్ 20 మంది ఎమ్మెల్యేల‌తో క్యాంపు రాజ‌కీయాల్ని షురూ చేశారు.

ఇదే అద‌నుగా ప‌ళ‌ని స‌ర్కారును బ‌లం నిరూపించుకోవాల‌న్న డిమాండ్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చారు త‌మిళ‌నాడు విప‌క్ష నేత స్టాలిన్‌. తాజాగా త‌మిళ‌నాడు ఇన్ ఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావును క‌లిసి.. బ‌ల‌ప‌రీక్ష చేప‌ట్టాల‌ని సూచించారు. అయితే.. వారి విన‌తిని గ‌వ‌ర్న‌ర్ సున్నితంగా నో చెప్ప‌టంపై స్టాలిన్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

తాజా ప‌రిణామాల‌పై స్టాలిన్ ఫైర్ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్‌.. కేంద్ర ప్ర‌భుత్వాల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. త‌మిళ‌నాడులో త‌లెత్తిన రాజ‌కీయ సంక్షోభం వెనుక కేంద్రం ఉంద‌ని తాను మొద‌టినుంచి చెబుతున్నాన‌ని.. ఇప్పుడు అదే నిజ‌మ‌ని తేలుతుంద‌న్నారు.

సీఎం ప‌ళ‌నిస్వామిని విశ్వాస ప‌రీక్ష‌కు అనుమ‌తించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరితే.. ఆయ‌న నిరాక‌రించ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్టాలిన్ భాగ‌స్వామ్య పార్టీల‌తో రేపు (గురువారం) ఉద‌యం రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ను క‌ల‌వ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రప‌తిని క‌లిసిన త‌ర్వాత కూడా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై చర్య‌లు తీసుకోకుంటే కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు చెప్పారు.

స్టాలిన్ వ్యాఖ్య‌ల్ని చూస్తే.. ఇంత‌కాలం రాజ్ భ‌వ‌న్ చుట్టూ తిరిగిన రాజ‌కీయం ఇక ఢిల్లీకి చేర‌నున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. తాజా ఇష్యూపై కోవింద్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రప‌తిగా ఎన్నిక అయ్యాక‌.. తొలిసారి పెద్ద ప‌రీక్ష‌నే కోవింద్ ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.