Begin typing your search above and press return to search.
స్టాలిన్ మాట!... కమల్ పిచ్చోడు!
By: Tupaki Desk | 28 Sep 2017 6:36 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్.. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళనాడులో రాజకీయ పరిస్థితి ఏమీ బాగోలేదని, ప్రభుత్వాన్ని నడిపే సత్తా ప్రస్తుతం ఉన్న నేతలకు చేతకావడం లేదని, అంతా అవినీతి మయం చేసేశారని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని ఆయన వెల్లడించారు.అంతేకాదు, సొంతగా ఓ రాజకీయ పార్టీని సైతం తాను స్థాపిస్తానన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కమల్ చేసిన పర్యటనలు - ప్రసంగాలు - మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాక.. కమల్ తొలిసారి కేరళలో పర్యటించారు. అక్కడి సీఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు.
దీంతో అందరూ కమల్ ఎర్రజెండా బ్యాచ్ లో చేరిపోతున్నారని అనుకున్నారు. కమల్ కూడా దీనికి విరుద్ధమైన వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలంటే తనకు ఇష్టమని ప్రకటించారు. ఆ తర్వాత.. రెండు రోజుల కిందట ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవసరమైతే... తాను బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా వెనుకాడనని వెల్లడించి మరో బాంబు పేల్చాడు. వాస్తవానికి కమల్ నాస్తిక వాది.. పూజలు - దేవుళ్లు అంటే ఆయనకు ఇష్టం లేదు. కానీ, బీజేపీ దీనికి పూర్తిగా విరుద్ధం.. ప్రతిదానికీ ఆధ్యాత్మికతను ముడిపెట్టి.. ప్రచారం చేసేస్తుంది. అయితే, కమల్ ఈ పార్టీతో కలిసేందుకు సిద్ధమని ప్రకటించి మరో గందరగోళానికి తెరదీశారు.
ఇప్పుడు కమల్ చేసిన ఈ ప్రకటనలపైనే తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయం అంటే కమల్ ఏమనుకుంటున్నాడని ప్రశ్నించారు. పూటకో మాటతో కాలం గడుపుతాడా? అని ప్రశ్నించారు. కమల్ హాసన్ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిచ్చివాళ్లు రాజకీయాలకు పనికిరారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. "ప్రజాస్వామ్య దేశంలో 18 ఏళ్లు నిండిన ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ పిచ్చివాళ్లు మాత్రం పనికిరారు. నటుడు కమల్ హాసన్ ఓ సారి కాకి - మరోసారి కాషాయం అంటూ అయోమయంగా మాట్లాడతారు" అని స్టాలిన్ దుయ్యబట్టారు. ఇక, ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కమల్ అభిమానులు మండి పడుతున్నారు. మరి శభాష్ నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!!