Begin typing your search above and press return to search.

సీఎం రేసులోకి వచ్చేసిన స్టాలిన్

By:  Tupaki Desk   |   12 Feb 2017 4:41 AM GMT
సీఎం రేసులోకి వచ్చేసిన స్టాలిన్
X
తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి తెలిసిందే. పాలక అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సీఎం కుర్చీ కోసం పడుతున్నపోటీ అంతాఇంతా కాదు. ముఖ్యమంత్రి పదవి తమదంటే.. తమదంటూ పన్నీర్ సెల్వం.. శశికళ పోటీ పడుతున్న వేళ.. మీరే కాదు.. మేం కూడా అంటూ ప్రతిపక్ష నేత స్టాలిన్ రేసులోకివచ్చేశారు. నిన్నటి వరకూ పన్నీర్ ప్రభుత్వ ఏర్పాటుకు సాయం చేస్తామంటూ చెప్పిన స్టాలిన్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. తాము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో రేసులో ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవర్ లో లేకున్నాప్రజాశ్రేయస్సు కోరుకోవటం తమ పార్టీ కర్తవ్యంగా భావిస్తామని చెపిన ఆయన.. ప్రజలను తమ వైపునకు తిప్పుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నట్గా చెప్పారు. శశికళ.. పన్నీర్ మధ్య బలపరీక్ష అనివార్యమైతే.. ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని రెండురోజులక్రితం వెల్లడించిన స్టాలిన్.. అందుకు భిన్నంగా తాము సైతం ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలుచేస్తున్నామన్న మాటను చెప్పేయటం గమనార్హం.

స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమే తప్పించి.. ఆచరణలో సాధ్యంకాదన్న మాట వినిపిస్తోంది. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ కు అనుకూలంగా ఉంటున్నారన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అన్నాడీఎంకేను దెబ్బ తీయటానికే డీఎంకే కుట్ర పన్నుతుందన్న విమర్శల్నిఈ మధ్య కాలంలో శశికళ వర్గీయులు మరింత పెంచేశారు.

ఈ నేపథ్యంలో కుట్ర ముద్ర వేయించుకునే కన్నా.. అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వఏర్పాటుకు తాము సైతం సిద్ధమన్న మాటను చెప్పటం ద్వారా.. పన్నీర్ తో కలిసి కుట్రకు పాల్పడటం లేదన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని స్టాలిన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రెండు రోజుల వ్యవధిలో స్టాలిన్ టోన్ మారటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.