Begin typing your search above and press return to search.
సీఎం పళనితో స్టాలిన్ భేటీ ఎందుకు?
By: Tupaki Desk | 7 Aug 2018 11:26 AM GMTతమిళనాడు రాజకీయ కురువృద్ధుడు.. డీఎంకే మూలస్తంభం.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం గడిచిన కొన్ని రోజులుగా ఏ మాత్రం బాగోకపోవటం తెలిసిందే. గడిచిన కొంతకాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురి కావటం.. ఆసుపత్రికి చేరటం.. అంతలోనే స్వస్థతతో డిశ్చార్జ్ కావటం తెలిసిందే.
రెండు రోజులు క్రితం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.ఇదిలా ఉంటే.. ఆయన ఆరోగ్యంపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే సమయంలో.. ఆసుపత్రికి డీఎంకే కార్యకర్తల తాకిడి అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆయన అరోగ్యం విషమంగా ఉన్న సమాచారంతో పలువురు జాతీయ నేతలు చెన్నైకి వెళ్లటం.. కరుణను పరామర్శించటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో కరుణ తనయుడు స్టాలిన్ భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. పళనిస్వామి ఇంటికి వెళ్లిన ఆయన.. సీఎంతో భేటీ అయ్యారు. స్టాలిన్ తో పాటు మరో ముగ్గురు పార్టీ సీనియర్ నేతలు వెంట ఉండటం గమనార్హం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కరుణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆయన్ను పరామర్శించేందుకు పళనిస్వామి రావాలనుకున్నా.. అక్కడి డీఎంకే కార్యకర్తల భావోద్వేగాల నేపథ్యంలో రాలేకపోవటం.. కరుణ తాజా ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకోవాలని భావించటంతో స్టాలినే స్వయంగా వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరో వాదన ప్రకారం.. కరుణ ఆరోగ్యం విషమంగా ఉండటంతో.. ఎలాంటి విపత్తు మీద పడకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముందస్తు జాగ్రత్తగా స్టాలిన్ తో పళనిస్వామి భేటీ అయినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కరుణ ఆరోగ్యంపై ఈ సాయంత్రం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.