Begin typing your search above and press return to search.
వారి మాటలతో అమ్మ మృతిపై మరిన్ని డౌట్లు?
By: Tupaki Desk | 8 March 2017 8:33 AM GMTఅమ్మ జయలలిత మృతిపై నెలకొన్న సందేహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పోయెస్ గార్డెన్ లో జయ మీద దాడి జరిగిందని.. అపస్మారక స్థితిలో ఆసుపత్రిలోకి తెచ్చినట్లుగా ఇప్పటికేపలువురు నేతలు ఆరోపించటం.. దీనికి సంబంధించిన ఆధారాలేవీ బయటకు రాని విషయం తెలిసిందే. అయితే.. అపోలో ఆసుపత్రి యాజమాన్యం.. ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికల్లో పలు అంశాల మధ్యనున్న వైరుధ్యం అమ్మ మృతి మీద సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. దీనికి తోడు.. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్.. పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ రాందాస్ సంధించిన సందేహాల్ని చూసినప్పుడు అనుమానాలు బలపడటమే కాదు.. ఏదో జరిగిందన్న భావనకు గురి కావటం ఖాయం.
ఈ ఇరువురు నేతలు వేర్వురుగా స్పందించినప్పటికీ.. ఇద్దరి సందేహాలు మాత్రం ఒకే తీరులో ఉండటం గమనార్హం. అపోలో విడుదల చేసిన హెల్త్ బులిటెన్ కు.. ఎయిమ్స్ వైద్యుల నివేదికకు మధ్య వ్యత్యాసం ఉందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు 25న అపోలో వైద్యులు విడుదల చేసిన బులిటెన్ లో జ్వరం.. ఆహార లోపంతో ఆసుపత్రిలో చేరినట్లుగా.. మరికొద్ది రోజుల్లో ఇంటికి వెళుతున్నట్లుగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఎయిమ్స్ వైద్యులు మాత్రం.. అమ్మ ఆసుపత్రికి చేరే నాటికి అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఇరు వర్గాలు చెబుతున్న వాదనల్లో ఉన్న అంతరాన్ని ఎత్తి చూపుతున్నారు.
అపోలో విడుదల చేసిన తాజా నివేదికలో పొంతలేని సమాధానాలు చాలా ఉన్నాయని ఇద్దరు నేతలు చెబుతున్నారు. అపోలో వైద్యుల నివేదికతో పాటు.. ఎయిమ్స్ వైద్యుల నివేదిక మీదా పలు సందేహాల్ని వ్యక్తం చేశారు రాందాస్. ఎయిమ్స్ వైద్యుల మాటే నిజమైన పక్షంలో..అపస్మారక స్థితిలో ఉండి ఆసుపత్రిలో చేరిన జయ.. స్థానికసంస్థల ఎన్నికల నామినేషన్ల పేపర్ల మీద వేలిముద్రలు ఎలా వేశారు? అన్నసందేహాన్ని వ్యక్తం చేశారు. అన్నింటికంటే కీలకమైన విషయం.. పన్నీరు సెల్వానికి సంబంధించింది. అమ్మకు జరిగిన వైద్యం ఏమిటో తనకు తెలీదని.. ఆమెను చూసేందుకు సైతం అనుమతించలేదని ఈ మాజీ ముఖ్యమంత్రి వెల్లడించగా.. నివేదికలో మాత్రం పన్నీర్ కు అన్ని తెలుసన్న విషయాన్ని ప్రస్తావించటాన్ని ఎత్తి చూపిస్తున్నారు. నివేదికల్లో ఉన్న సమాచారానికి.. మిగిలిన వివరాలకు పొంతన లేకపోవటాన్ని వేలెత్తి చూపిస్తుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/