Begin typing your search above and press return to search.
10కోట్ల పరువునష్టం దావా వేసిన స్టాలిన్ భార్య
By: Tupaki Desk | 27 July 2019 5:29 AM GMTప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షులే రాజులు.. వాళ్ల కుటుంబ సభ్యులదే పెత్తనం.. టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్.. టీడీపీలో చంద్రబాబు, లోకేష్.. అలానే తమిళనాట కూడా ఇప్పుడు కరుణానిధి చనిపోయాక డీఎంకే పార్టీకి స్టాలిన్ అధ్యక్షుడిగా అంతా తానై వ్యవహరిస్తున్నారు.. ఇక ఆయన భార్య దుర్గ సీఈవో లెవల్లో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారు. అల్లుడు శబరీశన్ ట్రెజరీ డబ్బుల లెక్కలు చూస్తుంటాడట.. కొడుకు యూత్ వింగ్ కు అధ్యక్షుడిగా ఇటీవలే ప్రకటించారు.
అయితే ఇలా పార్టీలో మొత్తం ఫ్యామిలీకే గుత్తాధిపత్యం ఇవ్వడం తమిళనాట వివాదాలకు కారణమైంది. పలువురు విమర్శలు కూడా చేశారు. ఈ కోవలోనే తమిళ పత్రిక ఆనంద వికటన్ గ్రూపు తాజాగా డీఎంకేపై కవర్ స్టోరీ కథనం వేసింది. డీఎంకే ఒక ప్రైవేటు సంస్థగా మారిందని.. స్టాలిన్ భార్య, కొడుకు, అల్లుడు సీఈవో, ఎండీ, ట్రెజరర్ లు అంటూ ఆడిపోసుకుంది.
అయితే ఈ వార్త దుమారం రేపడం.. స్టాలిన్ ఫ్యామిలీ పరువు తీయడంతో స్టాలిన్ భార్య దుర్గ సీరియస్ అయ్యారు. తక్షణం క్షమాపణలు చెప్పాలని లేకపోతే భారీ పరువు నష్టం దావా వేస్తామని పత్రికకు హెచ్చరికలు జారీ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే 10 కోట్లకు పరువు నష్టం దావాకు రెడీగా ఉండాలని ఆమె మీడియా సంస్థకు అల్టీమేటం జారీ చేయడం తాజాగా సంచలనమైంది.