Begin typing your search above and press return to search.
అమరావతి భూ అక్రమాల్లో బాబు, ఐఏఎస్ లుః ఎమ్మెల్యే
By: Tupaki Desk | 4 July 2021 4:30 PM GMTఅమరావతి భూముల సేకరణలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని, నాటి సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని పీవోఏ, పీవోటీ యాక్టులను తుంగలో తొక్కి మరీ భూములను లాక్కున్నారని సీఐడీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఈ అక్రమంలో చంద్రబాబు,మంత్రి నారాయణతోపాటు కొందరు ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. భూమి పుత్ర రియల్ ఎస్టేట్ ద్వారా తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారని, ఈ సంస్థ వెనుక చంద్రబాబు ఉన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
రాజధాని ప్రాంతంలో దళితులు ఉండొద్దనే ఈ కుట్ర చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తమ వద్ద ఉన్న వీడీయో ఆధారాలను సీఐడీకి అందించనున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో భూమిపుత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానంద రెడ్డిని అరెస్టు చేసి, విచారణ చేయాలని డిమాండ్ చేశారు.