Begin typing your search above and press return to search.
నమ్మితే ప్రాణమిస్తానంటున్న బాలయ్య
By: Tupaki Desk | 5 Sep 2017 4:10 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బావమరిది కమ్ వియ్యంకుడైన సినీ నటులు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన ముచ్చట చెప్పారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్నంతనే ఔరా.. బాలయ్య అన్న భావన మనసులో కలగటం ఖాయం.
తన తీరుతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న బాలయ్యకు.. నమ్మితే ప్రాణమిస్తానని చెబుతున్నారు. ముక్కుసూటిగా.. కుండ బద్ధలు కొట్టేలా మాట్లాడే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే తన స్వభావం ఉంటుందని.. నమ్మితే ప్రాణమిస్తానని చెప్పారు. సేవా కార్యక్రమాల్ని నిర్వహించే వారిని ప్రజలు నమ్ముతారన్నారు.
రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానని చెప్పిన బాలయ్య మాటను కాసేపు ఓ పక్కన పెట్టి.. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో హిందూపురంలో ఎంత అభివృద్ధి చేశారో చెబితే బాగుంటుంది. అభివృద్ధి కార్యక్రమాల కంటే కూడా.. హిందూపురంలో బాలయ్య ఎన్నిసార్లు వచ్చారన్న విషయాన్ని ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ తరహా మాటలు ఆయన నోటి నుంచి రావేమో?
తనను అభిమానించి.. ఆరాధించే అభిమానగణం.. తనను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లకు బాలయ్య ప్రాణాలు ఇవ్వనక్కర్లేదు కానీ.. కాస్తంత వారి సమస్యల మీద దృష్టి పెడితే చాలంటున్నారు. నమ్మితే ప్రాణమిస్తానని చెబుతున్న బాలయ్య.. తనను నమ్మి.. విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే అభిమానుల మీద ఎందుకంత దురుసుగా వ్యవహరిస్తారో? అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మరి.. ఇలాంటి సందేహాలకు సైతం బాలయ్య సమాధానం చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన తీరుకు భిన్నమైన మాటల్ని బాలయ్య ఎంత అలవోకగా చెప్పారో అన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.