Begin typing your search above and press return to search.
పది రోజుల క్రితమే డాక్టర్ దగ్గరకు వెళ్లిన భూమా
By: Tupaki Desk | 12 March 2017 12:31 PM GMTహుషారుగా ఉంటూ.. ఆచితూచి మాట్లాడే భూమాకు ఏమైంది?నిక్షేపంగా ఉన్నట్లు కనిపించే ఆయనకు గుండెనొప్పి ఏమిటి? అంతలోనే.. చనిపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు ఆయన గురించి తెలిసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆయన కుటుంబసభ్యులు.. సన్నిహితులైతే నోట మాట రాని పరిస్థితి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య.. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించటంతో తీవ్రమైన మనోవ్యధకు గురైన భూమా గుండె.. బలహీనపడటం మొదలైంది. మొదట్నించి సిగిరెట్లు ఎక్కువగా తాగే అలవాటున్న భూమా ఆరోగ్యం బాగానే ఉన్నా.. శోభ మరణం తర్వాత మాత్రం.. ఆయన మొత్తగిల్లినట్లే కనిపించారు.
గతంలో మాదిరి ఉత్సాహంగా లేని భూమా.. రెండేళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో ఆయన్ను జాగ్రత్తగా ఉండాలన్న మాటనుపలువురు చెబుతున్నారు. నిన్నటికి నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వేళ.. పార్టీ విషయాలు..రాజకీయాల ముచ్చట్లు అయ్యాక.. ఆరోగ్యాన్నిజాగ్రత్తగా చూసుకోవాలన్న మాట చంద్రబాబు చెప్పటాన్నిమర్చిపోకూడదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పది రోజుల క్రితం టెస్టుల కోసం హైదరాబాద్ లోని కిమ్స్ లో ఒక ప్రైవేటు వైద్యుడ్ని సంప్రదించారు.
ఈ సందర్భంగా మెడికల్ టెస్టులు చేయించుకోగా.. అంతా బాగుందన్న మాట చెప్పినట్లుగా చెబుతున్నారు. పది రోజుల క్రితం అంతా బాగున్న భూమా.. ఈ రోజు ఉదయం పేపర్ చదువుతూ కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోవటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఛాతీ నొప్పితో భూమా కుప్పకూలే సమయంలో ఆయన పెద్ద కుమార్తె.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం దేవస్థానంలో పూజలు చేస్తుండటం. తండ్రికి గుండెనొప్పి వచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే పరుగున ఆసుపత్రికి పయనించిన ఆమె.. ఆసుపత్రికి చేరుకునేసరికే భూమా ఆఖరిశ్వాస ఆగిపోయింది. రోడ్డు ప్రమాదంలో తల్లిని పొగొట్టుకొన్న మూడేళ్ల (రెండు..మూడు నెలలు తక్కువగా) లోపే తండ్రిని కోల్పోయిన తీరు.. అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. భూమా ఆకస్మిక మృతి పట్ల రాజకీయ అధినేతలు.. నేతలంతా దిగ్భాంత్రిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.. ఏపీ మంత్రులతో సహా తెలంగాణ నేతలు.. సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.