Begin typing your search above and press return to search.
తిరుపతిలో సైకిల్ మీద తిరిగిన భూమనకు అన్ని దారుణాలు కనిపించాయట
By: Tupaki Desk | 3 Jun 2021 7:30 AM GMTఅధికారపక్షానికి చెందిన ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే ఒకరు ముఖానికి మాస్కు పెట్టుకొని.. ఎలాంటి సెక్యురిటీ ఆర్భాటం లేకుండా తన నియోజకవర్గంలో తిరిగితే? గల్లీ గల్లీ తిరుగుతూ.. అసలేం కనిపిస్తుందన్న వినూత్న ప్రయోగం చేస్తే? సినిమాటిక్ గా అనిపిస్తున్నా.. నిజంగానే అలాంటి పనే చేసిన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకులు కనిపించాయట.
అధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇన్ని దారుణాలా? అంటూ ఆయన విస్మయానికి గురవుతున్నారు. కరోనా వేళ కావటంతో ముఖానికి మాస్కు పెట్టుకొని తానెవరో తెలీకుండా జాగ్రత్త పడుతూ.. తిరుపతి వీధుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన పలు వీధుల్లో తిరిగారట. ఈ సందర్భంగా తన కళ్లను తాను నమ్మలేని ఉదంతాలు తనకు కనిపించాయని చెప్పారు.
తిరుపతిలో గంజాయి.. ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని.. డ్రగ్స్ కు బానిసైన కొందరు యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్న వైనం తన కంట్లో పడినట్లు చెప్పారు. అంతే కాదు.. పరమ దుర్మార్గంగా అమ్మాయిలకు సైతం ఈ మత్తుమందుల్ని అలవాటు చేసి వారిని వల్లో వేసుకొని పశువాంఛ తీర్చుకుంటున్నారంటూ సంచలన విషయాల్ని వెల్లడించారు. ఒక సామాన్య వ్యక్తిగా సైకిల్ మీద తిరుపతి వీధుల్లో తిరుగుతుంటే.. మత్తులో ఉన్న యువకుల్ని తాను చూసినట్లు చెప్పారు.
తిరుపతిలో గంజాయి అమ్మకాల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరిన భూమన.. తిరుపతి ఎస్పీ అప్పలనాయుడ్ని స్వయంగా కలిసి మూడు పేజీల కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకైనా మంచిది మరో పది రోజులైన తర్వాత మరోసారి మాస్కు పెట్టుకొని సైకిల్ ఎక్కి తిరుపతిలో తిరిగితే ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా? అన్న విషయాన్ని భూమన పరిశీలిస్తే బాగుంటుంది. తన ఫిర్యాదుకు ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయాన్ని ఆయన గమనించాల్సిన అవసరం ఉంది.