Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీజేపీ ఎంపీ
By: Tupaki Desk | 19 Jan 2020 1:15 PM GMTనిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ప్రచారంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వర్సెస్ బీజేపీ ఎంపీ అరవింద్ ఫైట్ జోరుగా సాగుతోంది. నిజామాబాద్ లో ఇప్పుడు టీఆర్ ఎస్ - బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
నిజామాబాద్ కార్పొరేషన్ లో గెలుపొంది.. మేయర్ పదవిని చేపడితే వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ మొదటి సంతకం చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించడం సంచలనంగా మారింది.ఇక కార్పొరేషన్ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు టీఆర్ ఎస్ రెడీ అయ్యిందని అరవింద్ ఆరోపణలు కాకరేపాయి.
దీనిపై టీఆర్ ఎస్ భగ్గుమంది.. టీఆర్ ఎస్ నిజామాబాద్ నగర ఎమ్మెల్యే గణేష్ బిగాల కౌంటర్ ఇచ్చారు. టీఆర్ ఎస్ అభ్యర్థి మేయర్ కాకుండా ఎంఐఎంకు మేయర్ స్థానాన్ని కట్టబెడితే ప్రెస్ క్లబ్ నుంచి కంఠేశ్వర్ వరకూ ముక్కు నేలకు రాస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సవాల్ చేశారు.