Begin typing your search above and press return to search.
చింతమనేని హత్యకు సొంత పార్టీ నేత కుట్ర?
By: Tupaki Desk | 11 Jun 2017 3:20 AM GMTచంద్రబాబుకు అత్యంత ఇష్టమైన జిల్లా పశ్చిమగోదావరిలో టీడీపీ నేతలే ఒకరినొకరు హత్యలు చేయించడానికి సిద్ధవమవుతున్నట్లుగా కనిపిస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను హత్య చేయడానికి టీడీపీకే చెందిన ఓ నేత ప్లాన్ చేశారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేశారు. ఇది పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ర్టవ్యాప్తంగా టీడీపీలో కలకలం రేపింది. మరోవైపు టీడీపీ హత్యా రాజకీయాలపై విపక్షాల్లోనూ చర్చ జరుగుతోంది.
ఇటీవల కొద్దికాలంగా చింతమనేని ప్రభాకర్ ను కొందరు అనుసరిస్తున్నారట. తనను గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడుతున్నారని అనుమానం వచ్చిన చింతమనేని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా ఉంచిన పోలీసులు… కొవ్వలిలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని గట్టిగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చింతమనేనితో పాటు మరో ఇద్దరిని కూడా చంపేందుకు ప్లాన్ చేసినట్టు సదరు వ్యక్తి బయటపెట్టారు. అయితే... ఇక్కడ ట్విస్టేంటంటే... చింతమనేని హత్యకు సుపారీ ఇచ్చింది కూడా టీడీపీ నాయకుడే. టీడీపీ మాజీ ఎంపీపీ అనురాధ భర్త అప్పలనాయుడే ఈ హత్యలకు పథకరచన చేసినట్టు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అప్పలనాయుడుతో పాటు మరో 8 మందిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత కాలంగా చింతమనేని ప్రభాకర్, అప్పలనాయుడు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని... ఆ క్రమంలో, వ్యక్తిగత కక్ష్యలతో ఇది జరిగినట్లు ఆ జిల్లా నేతలు చెప్తున్నారు. అయితే.... ఇందులో మరో కోణం కూడా వినిపిస్తోంది. అప్పలనాయుడేమీ హత్యకు పథక రచన చేయలేదని... రాజకీయంగా తనకు అడ్డం తగులుతున్న అప్పలనాయుడిని ఈ కారణంగా జైల్లో పెట్టించేందుకు చింతమనేనే ఈ డ్రామా ఆడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఇదంతా ఇన్నాళ్లు చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న పశ్చిమగోదావరిలో పరిణామాలు పార్టీ పరువును బజారుకీడ్చాయి. నిజానికి నెలకోసారి ఆ జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఇంతకాలంలో ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవటం కూడా ఒక సమస్యగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టును స్వయంగా పర్యవేక్షించేందుకు ప్రతినెల ఒక సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. అయినా... పశ్చిమగోదావరి టీడీపీలో మాత్రం రచ్చరచ్చ జరుగుతూనే ఉంది.
మరోవైపు ఇదంతా పార్టీలో విభేదాలు, అంతర్గత రాజకీయాల వల్ల జరిగిందని అర్థమవుతోంది. ఏలూరు మండలంలో కొంతభాగం దెందులూరు నియోజకవర్గ పరిధిలో, మిగిలిన భాగం ఏలూరు నియోజకవర్గంలోనూ ఉంది. దీంతో ఏలూరు ఎంపీపీ పదవి విషయంలో మూడేళ్ల క్రితమే ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం మండల పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉన్నందున మొదటి రెండున్నరేళ్లు రెడ్డి అప్పలనాయుడు సతీమణి రెడ్డి అనురాధకు, మిగిలిన రెండున్నరేళ్లు దెందులూరు నియోజకవర్గం పరిధిలోని మోరు హైమావతికి అవకాశం కల్పించాలని అప్పట్లో నిర్ణయించారని నేతలు చెప్తున్నారు. అ విధంగానే కొద్దికాలం క్రితం రెడ్డి అనురాధను తప్పించి హైమావతికి పట్టం కట్టారు. ఈ సమయంలోనే అప్పలనాయుడు ప్రభుత్వ విప్ చింతమనేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటం, ఏకంగా అవినీతి ఆరోపణలు కూడా చేయటంతో ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరగ్గా.. అప్పలనాయుడు చింతమనేనికి ఏమాత్రం తలొంచడం లేదని.. దీంతో అప్పలనాయుడిపై కక్ష్య పెట్టుకుని చింతమనేని ఇలా ఇరికించారన్న వాదనా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/