Begin typing your search above and press return to search.
మీడియాపై చిందులు వేసిన చింతమనేని!
By: Tupaki Desk | 30 Oct 2018 3:33 PM GMTగత నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడి పాలనలో ఏపీలో అవినీతి పేట్రేగిపోతోందని ప్రజలు అభిప్రాయపడుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు - అక్రమాలు - కబ్జాలకు పాల్పడుతున్నా....ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ప్రజలు వాపోతున్న విషయం విదితమే. ముఖ్యంగా - అధికార పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు పలు వివాదాల్లో వినిపిస్తోంది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా, మరోసారి తన అధికారాన్ని చింతమనేని ప్రదర్శించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి దిగారు. దీంతో చింతమనేనిపై విజిలెన్స్ అధికారులు పెదవేగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, చింతమనేని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని - తమను భ్రాంతులకు గురిచేశారని వెజిలెన్స్ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ ఘటనపై వివరణ కోరిన మీడియా ప్రతినిధులపైకి దూసుకెళ్లిన చింతమనేని బూతుపురాణం వినిపించారు.
కొప్పాక దగ్గర జరుగుతోన్న అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు. నాలుగు టిప్పర్లు - ప్రొక్లైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చింతమనేని....విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ టిప్పర్లనే సీజ్ చేస్తారా...తమ వాళ్లపైనే కేసులా అంటూ దౌర్జన్యానికి దిగారు. సీజ్ చేసిన వాహనాలు వదిలేయాని అధికారులను బెదిరించారు. చింతమనేని సోదరుడు చింతమనేని సతీష్ తోపాటు 100 మంది టీడీపీ కార్యకర్తలు...విజిలెన్స్ అధికారులను చుట్టుముట్టారు. అధికారులను బెదిరించి సీజ్ చేసిన నాలుగు వాహనాలను తీసుకెళ్లారు. దీంతో, చింతమనేని - ఆయన సోదరుడిపై అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంపై వివరణ కోరిన మీడియాతోను చింతమనేని దురుసుగా ప్రవర్తించారు. ‘మీ అంతు తేలుస్తా.. తొక్కిపెట్టి నారతీస్తా నా....’ అంటూ బూతు పురాణం వినిపించారు.