Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే వాయిస్ అంటున్నారు.. నిజమా? కాదా?
By: Tupaki Desk | 2 March 2021 3:49 PM GMTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల చిచ్చు ఇంకా తొలగిపోవడం లేదు. ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు పోటీపడి పంచాయతీలను గెలుచుకున్నాయి. అయితే గ్రామాల్లో వలంటీర్లను ఉపయోగించుకొని వైసీపీ విజయం సాధించిందనే ఆరోపణలను టీడీపీ , జనసేనలు చేశాయి.
ఏపీలో సంక్షేమ పథకాల అమలు బాధ్యతను గ్రామాల్లో వలంటీర్లకు అప్పగించిన జగన్ సర్కార్ తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ వారిని వాడుకుందనే ఆరోపణలు తెచ్చుకుంది.
తాజాగా ఓ మహిళా వలంటీర్ పై గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ద్వారకా తిరుమల మండలం రాజుపాలెం వాలంటరీగా పనిచేస్తున్నారు కంకిపాటి అన్నామణి.. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజుపాలెం పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఈ క్రమంలోనే వలంటీర్ అన్నామణి టీడీపీ అభ్యర్థికి సపోర్టు చేశారని కొందరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వెంకట్రావ్ నేరుగా వాలంటీర్ కు ఫోన్ చేసి బెదిరించినట్టు ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహిళా వలంటీర్ ను దూషించినట్టు ఉంది ఆ ఆడియోలో.. దేవరపల్లి క్యాంప్ ఆఫీసుకు వచ్చి కలవాలని.. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించినట్టు ఉంది.
అయితే ఇది నిజమైన ఆడియోనా? లేక ఫేక్ ఆడియోనా? ఎవరైనా సృష్టించారా? అన్నది క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. దీనిపై ఎమ్మెల్యే వెంకట్రావ్ అధికారికంగా స్పందించలేదు. అసలు నిజాలు తెలియాల్సి ఉంది.